పుర‌పోరు: ఆ టీడీపీ సీనియ‌ర్‌కు ఇంత‌కు మించిన టైం రాదా ?

VUYYURU SUBHASH
మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి నెల్లూరు కార్పొరేష‌న్ ను గెలిపించే బాధ్య‌త‌ల‌ను అధికారికంగా అప్ప‌గించారు. దీనిని చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు మంచి నిర్ణ‌యం అంటున్నారు. వాస్త‌వానికి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న ఐదు ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేక పోయారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీలోనూ ప‌ట్టు సాధించ‌లేక పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు చంద్ర‌బాబు. దీనిని సీనియ‌ర్లు కూడా స్వాగ‌తిస్తున్నారు. మ‌రి ఇది ఎలా సాధ్య‌మో.. అర్ధం కావ‌డం లేద‌నే సందేహాలు ఉన్నాయి.

వాస్త‌వానికి నెల్లూరు కార్పొరేష‌న్‌ను వైసీపీ ప‌రం చేసేందుకు మంత్రి అనిల్ కుమార్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నా రు. త‌నే స్వ‌యంగా రోడ్ల మీద‌కు వ‌చ్చి.. సామాన్య కార్య‌క‌ర్త‌గా జెండా ప‌ట్టుకుని ముందుకు సాగుతున్నారు. వార్డుల్లోనూ ప‌ర్య‌ట‌న‌లు ఏర్పాటు చేయాల‌ని కార్య‌క్రమ నిర్వాహ‌కులకు చెప్పారు. అదే స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించారు. దీనిని బ‌ట్టి.. అధికార పార్టీ దూకుడు ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది.

ఈ స‌మ‌యంలో సోమిరెడ్డికి ఇక్క‌డ ప‌గ్గాలు అప్ప‌గించారు చంద్ర‌బాబు. సోమిరెడ్డి దూకుడు నిర్ణ‌యాలు తీసుకోలేరు. పైగా అనిల్ మాదిరిగా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు కూడా చేయ‌లేరు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆయ‌న‌కే ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. ఆయ‌న‌ను సీనియ‌ర్లు స్వాగ‌తించ‌డం వంటివి టీడీపీలో ఆస‌క్తిగా మారాయి. గ‌త 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం సాధించింది. త‌ర్వాత పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు మ‌ళ్లీ కార్పొరేష‌న్‌ను ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అయితే.. సోమిరెడ్డివంటివివాద ర‌హిత నాయ‌కుడు ఉంటే.. సీనియ‌ర్లు క‌లిసి వ‌స్తార‌ని.. కార్పొరేష‌న్ ప‌రిధిలోని మేధావి వ‌ర్గాలు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు సోమిరెడ్డి కి క‌లిసి వ‌స్తార‌ని భావిస్తున్న‌ట్టు సీనియ‌ర్లు చెబుతున్నారు. అయితే.. యువ‌త ప‌రిస్థితి ఏంటి ? అనేది దానికి మాత్రం స‌మాధానం లేదు. దీనిని బ‌ట్టి.. ఏం జ‌రుగుతుందో తెలియ‌దు కానీ.. చంద్ర‌బాబు మాత్రం సోమిరెడ్డికి గ‌ట్టి బాధ్య‌త‌లే అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: