అయోధ్యకు 600 కోట్లు.. యోగి సర్కార్ కీలక నిర్ణయం..?

praveen
సుప్రీంకోర్టులో వివాదాస్పదమైన అయోధ్య విభాగం విషయంలో హిందువులకు అనుకూలం గా తీర్పు రావడం ఇక అయోధ్య భూభాగం హిందువులకు సంబంధించినది  అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో కొన్ని దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న హిందువుల కల నెర వేరింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అయోధ్య భూ భాగం లో శర వేగంగా రామాలయ నిర్మాణానికి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. అయితే రామాలయ నిర్మాణం కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసింది కేంద్రం అన్న విషయం తెలిసిందే.


 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టుకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది విరాళాలు అందిస్తున్నారు. హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా మత సామరస్యం గా రామాలయ నిర్మాణానికి విరాళాల అందజేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయం లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రామాలయ నిర్మాణాన్ని శర వేగంగా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది.  అయోధ్య భూభాగాన్ని మొత్తం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతుంది యోగి సర్కార్.



 ఈ క్రమం లోనే అయోధ్య భూ భాగంలో ఈ విమానాశ్రయాన్ని శరవేగంగా అభివృద్ధి చేయడమే కాదు ఇక ఈ విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అనే  పేరు పెట్టడం ఆసక్తి కరం గా మారి పోయింది. అంతేకాకుండా ప్రస్తుతం ఆలయ నిర్మాణాన్ని ట్రస్టు చూసుకుంటూ ఉంటే ఇక అయోధ్య విభాగం లో అభివృద్ధిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ క్రమం లోనే అయోధ్య రామాలయం కి వచ్చే అన్ని మార్గాలను కూడా ఆనాడు అయోధ్య లో ఎలా ఉన్నాయో అలాగే 108 రకాల ఔషధ మొక్కలు పెంచుతుంది యోగి సర్కార్. దీని కోసం ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: