డబ్ల్యూడబ్ల్యూఈ ని మించిపోయిన స్ట్రీట్ ఫైట్.. వైరల్ వీడియో..?

praveen
ఈ మధ్యకాలంలో జనాలు ఎలా మారిపోయారు అంటే..  ఎవరైనా ఇక ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటూ ఉన్నారు అంటే  చాలు ఏదో సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకేనేమో ఇక డబ్ల్యూ డబ్ల్యూఈ   లాంటివి ప్రెసిడెంట్ బాగా ఫేమస్ అయ్యాయి. అందులో అందరూ రెజలర్స్  కూడా కండలు తిరిగిన దేహంతో ఉండి ఇక ఊహించని విధంగా ఒకరిపై ఒకరు దాడి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఇక టీవీల ముందు ఉన్న ప్రేక్షకులు అందరూ ఎంతో ఆనందంగా ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.

 సాధారణంగా ఫైటింగ్ అనగానే అందరికీ డబ్ల్యూ డబ్ల్యూఈ  గుర్తొస్తుంది అన్న విషయం తెలిసిందే.  అందులో కండలు తిరిగిన దేహంతో రెజలర్స్  ఫైటింగ్ చేస్తూ ఉండడం గుర్తొస్తుంది.  లేదా బాలయ్య సినిమా లోని అదిరిపోయేయాక్షన్ సీన్స్ గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని నిజ జీవితంలో మాత్రం అంతకు మించి అనే రేంజిలో గొడవలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా స్థానికుల మధ్య జరిగిన గొడవ కు సంబంధించి ఏదైనా వీడియో సోషల్ మీడియా వేదిక లోకి వచ్చింది అంటే చాలు నెటిజన్లు ఆ వీడియో చూడడానికి తెగ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇటీవలే పానీపూరి వ్యాపారులు కొట్టుకున్న ఘటన గురించి మర్చిపోకముందే ఇప్పుడు మహిళలు ఏకంగా డబ్ల్యు డబ్ల్యుఈ  రేంజ్ కాదు అంతకు మించి అనే రేంజ్ లో  కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘర్  లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చిన్న పిల్లల మధ్య మొదలైన ఈ వివాదం ఆ తర్వాత  పెద్దల వరకూ వెళ్ళింది ఈ క్రమంలోనే ఇక చిన్నారుల తల్లులు రోడ్లపైకి చేరి ఒకరి జుట్టు పట్టుకొని కొట్టుకునేంతవరకు దారితీసింది అయితే వారిని విడదీసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మాత్రం కొట్టుకుంటూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: