పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

VUYYURU SUBHASH
ఏపీలో మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల్లో ప‌లువురికి అగ్నిప‌రీక్ష‌గా మారాయి. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు మాత్రం ముగ్గురు కీల‌క నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. న‌గ‌రంలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్పొరేష‌న్ ఉంది. ప‌శ్చిమంలో మంత్రి వెల్లంప‌ల్లి ఉన్నారు. సెంట్ర‌ల్లో బ్రాహ్మ‌ణ కార్పొరేన్ చైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు ఉన్నారు. తూర్పులో దేవినేని అవినాష్ ఉన్నారు. అవినాష్ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా జ‌గ‌న్ పార్టీలో చేరిన వెంట‌నే తూర్పు ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేల‌కే ఇవ్వ‌ని ప్ర‌యార్టీ ఇస్తున్నారు. ఇటు అవినాష్ శ‌క్తికి మించి మ‌రీ క‌ష్ట‌ప‌డుతున్నారు.

అవినాష్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేయ‌లేదు.. ఇప్పుడు కూడా తూర్పు ఇన్ చార్జ్ మిన‌హా పెద్ద పెద్ద ప‌ద‌వుల్లోనూ లేడు. అవినాష్ క‌ష్టం, నిజాయితీ జ‌గ‌న్‌ను ఆక‌ర్షించాయి. జ‌గ‌న్ కూడా అవినాష్‌ను బాగా న‌మ్మాడు. దీంతో పార్టీలో ఎంతో మంది కీల‌క నేత‌ల‌కు ల‌భించ‌ని జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ అవినాష్‌కు ఎక్కువుగా ల‌భిస్తోంది. ఇక తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కార్పొరేష‌న్ డివిజ‌న్ల‌లో అవినాష్ ఎక్కువుగా లేదా టీడీపీ పెద్ద‌గా ఛాన్స్ ఇవ్వ‌కుండా మూడొంతుల‌కు పైగా డివిజ‌న్ల‌లో వైసీపీని గెలిపించ గ‌లిగితే... ఇంకా చెప్పాలంటే విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ప‌ద‌వి వైసీపీ ఖాతాలో వేయ‌డంలో తూర్పులో అవినాష్ పాత్ర కీల‌కంగా మారితే జ‌గన్ ద‌గ్గ‌ర అవినాష్ క్రేజ్ డ‌బుల్ అవ్వ‌డంతో పాటు ఇక బెజ‌వాడ రాజ‌కీయాల్లో తిరుగులేని పొలిటిక‌ల్ హీరో అయిపోతాడు అన‌డంలో సందేహం లేదు.

అయితే ఇప్పుడు అవినాష్ చేయాల్సింది అల్లా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వీలైతే స్వీప్ లేదా 80 - 90 శాతం డివిజ‌న్ల‌లో వైసీపీ పాగా వేసేలా చేయాలి. ఇప్ప‌టికే గ‌త యేడాదిన్న‌ర కాలంగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తోనే మ‌మేక‌మై ఉంటోన్న అవినాష్ ఈ ప‌రీక్ష‌లో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: