బంపర్ ఆఫర్.. నెలకు రూ.లు 4వేలు కడితే చాలు.. రాయల్ ఎన్ ఫీల్డ్ మీ సొంతం..?

praveen
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్టైలిష్ బైకులు ఉన్నప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ కి ఉన్న క్రేజ్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసింది. ఎవరు ఇప్పటి  నుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి ద్విచక్ర వాహనాలలో ఎక్కువ క్రేజ్ కలిగిన వాహనంగా రాయల్ ఎన్ఫీల్డ్ కొనసాగుతోంది. అయితే ప్రతి ఒక్కరికి రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేయాలి అనుకున్నప్పటికీ ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ధర  ఏకంగా లక్షల్లో ఉండటంతో కొందరు వెనకడుగు వేస్తూ  ఉంటారు. ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసే అవకాశం వస్తే మాత్రం కొనుగోలు చేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇటీవలె మోస్ట్ పవర్ఫుల్ బైక్ తయారీ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అదిరిపోయే ఆఫర్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది.  ఇక ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించిన ఆఫర్ తో  కస్టమర్లు ఎంతో తక్కువ ఈఎంఐ తోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.  మోస్ట్ పాపులర్ బైక్ క్లాసిక్  350 ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలి అని భావిస్తే ఇందుకోసం ముందుగా 20 వేల రూపాయల డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది.. ఇక ఆ తర్వాత మిగతా మొత్తాన్ని బ్యాంకు లోన్  రూపంలో అందిస్తుంది ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

 హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్ వంటి పలు సంస్థలతో రాయల్ ఎన్ఫీల్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుని తమ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే..  3,4, 5 ఏళ్ల కాల పరిమితిలో ఈఎంఐ ఎంత చెల్లించాల్సి  ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు 3 ఏళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.6,057 చెల్లించాలి. అదే మీరు 4 ఏళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.4941 కట్టాలి. అదే ఐదేళ్లకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.4,287 చెల్లించాలి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వెర్షన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.67 లక్షలుగా ఉంది. అదే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.71 లక్షలు. ఇకపోతే ఆన్‌రోడ్ ధర రూ.2 లక్షలు దాటిపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: