పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

VUYYURU SUBHASH
ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. ఈ క్ర‌మంలోనే కాపులు, జ‌న‌సేన అభిమానులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో అధికార వైసీపీకి జ‌న‌సేన గ‌ట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఓ మున్సిపాల్టీలో అయితే వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే పోటీ ఉండేలా క‌నిపిస్తోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ఉన్న న‌ర‌సాపురం మున్సిపాల్టీలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ముదునూరు ప్ర‌సాద‌రాజు 6 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధిస్తే.. అక్క‌డ రెండో ప్లేసులో జ‌న‌సేన ఉంది. టీడీపీకి కేవ‌లం 26 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నూ ఇక్క‌డ జ‌న‌సేన స‌త్తా చాటింది. డివిజ‌న్లో ఏకంగా 30 పంచాయ‌తీలు జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. ఇప్పుడు జ‌రిగే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా న‌రసాపురంలో వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే పుర పోరు ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే జ‌రిగితే ఇక్క‌డ టీడీపీ మరో సారి మూడో స్థానంతో స‌రి పెట్టు కోక త‌ప్ప‌దు.

పైగా న‌ర‌సాపురం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ కాపు ల ఓటింగ్ తో పాటు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. దీంతో ఏపీలో మిగిలిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల క‌న్నా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఈ రెండు పార్టీల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోటీ న‌డ‌వ‌నుంది. టీడీపీ ఇక్క‌డ మ‌ళ్లీ మూడో స్థానంతో సరి పెట్టుకోనుంది. టీడీపీ ఇక్క‌డ నాలుగైదు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేదు. మ‌రి ఈ పోరులో ఎవ‌రు విన్ అవుతారో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: