వంట చేసే ఆడవాళ్ళు.. ఇది తప్పక గుర్తుంచుకోండి..?
ఇక గ్యాస్ స్టవ్ పై ఎంతో సులభంగా వేగంగా కూడా వంటలు చేయడానికి వీలు ఉంటుంది. కానీ గ్యాస్ స్టవ్ పై వంట చేసేటప్పుడు మాత్రం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. గ్యాస్ స్టవ్ విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా జరగరాని ఘోరం జరిగిపోతుంది అని హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను గ్యాస్ కి దూరంగా ఉంచడం ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. సాధారణంగా అయితే చాలా ఇళ్ళల్లో స్టవ్ పక్కనే సింకు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
ఇక కొన్ని కొన్ని సార్లు ఇక స్టవ్ పక్కనే ఉన్న సింకులో బొద్దింకలు రావడంతో ఇక బొద్దింకలను నాశనం చేయడానికి.. కొన్ని రకాల స్ప్రేలు కొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గ్యాస్ అంటించిన సమయంలో స్టవ్ పక్కనే ఉన్న సింక్ లో స్ప్రే కొడితే ఇక ఆ ఫ్లైస్ప్రే గాల్లో వ్యాపించి మంటలు అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా స్టవ్ బర్నర్ లను నీటిలో వెయ్యకుండా కేవలం టూత్ బ్రష్ తో మాత్రమే క్లిన్ చేయాలని అంతేకాకుండా తడి గుడ్డతో తుడవాలి అంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా చేతికి శానిటైజర్ రాసుకుని వంట చేయకూడదు అని సూచిస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి రెగ్యులేటర్, గ్యాస్ పైప్ ని కూడా చెక్ చేయాలని చెబుతున్నారు.