పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి

VUYYURU SUBHASH
ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు హోరాహోరీగా కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రాధినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్లు ఉంటే ఖ‌చ్చితంగా గెలిచి తీరాల‌ని.. లేక‌పోతే డిమోష‌న్లు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే వార్నింగ్‌లు ఇచ్చేశారు. ఈ క్ర‌మంలోనే పార్టీ ఓడిన చోట్ల నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జ్‌ల‌కు సైతం గెల‌వాల‌న్న కండీష‌న్లు వ‌చ్చాయి. అందుకే ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వైసీపీ అధిష్టానం గ‌ట్టిగా టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా అద్దంకి మున్సిపాల్టీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

గతేడాది మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అద్దంకి మున్సిపాల్టీలో మూడు వార్డుల‌కు టీడీపీ త‌ర‌పున నామినేష‌న్లు వేసిన కౌన్సెల‌ర్ క్యాండెట్ల‌ను వైసీపీ వాళ్లు ఒత్తిడి చేసి త‌మ పార్టీ కండువాలు క‌ప్పుకున్నారు. ఒక‌టో వార్డు, 2, 17 వార్డ‌ల‌కు చెందిన టీడీపీ కౌన్సెల‌ర్ అభ్య‌ర్థుల‌ను వైసీపీ వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేయ‌డంతో వారు వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు. ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ రంగంలోకి దిగి పార్టీ మారిన వారిని తిరిగి టీడీపీలోకి తీసుకు వ‌స్తూ వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చారు.

ఇప్ప‌టికే 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భర్త మిద్దెబోయిన.పాపారావు, 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి  షేక్.సైదావలి తిరిగి సొంతగూటికి చేరారు,కొన్ని ఒత్తిళ్లకు లోనయ్యామని.. తెలుగుదేశంపార్టీ  కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తామని గౌరవ శాసనసభ్యులు శ్రీ.గొట్టిపాటి.రవికుమార్ కు స్పష్టం చేశారు. ఇక ఒక‌టో వార్డు అభ్య‌ర్థి కూడా తిరిగి టీడీపీలోకి వ‌చ్చేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ కౌన్సెల‌ర్ క్యాండెట్ కూడా రేపో మాపో పార్టీ మార‌డం ఖాయం. దీనిని బ‌ట్టి అద్దంకిలో వైసీపీ ఎత్తుకు పై ఎత్తుతో గొట్టిపాటి చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: