జగడ్డ : సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కర్నూల్లో బరిలోకి దిగిన బైరెడ్డి..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఇక ఎన్నికలు అధికార పార్టీ పాలనకు నిలువుటద్దంగా మారబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం అధికార పార్టీకి అడుగడుగున షాకులు తగులుతున్నాయి.

 రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ్యూహాత్మకంగా ఏకగ్రీవాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే అటు కర్నూలు జిల్లాలో మాత్రం వైసిపి వ్యూహాలు  అంతలా ఫలించడం లేదు.  ఇక ఎంత ప్రయత్నించినప్పటికీ కొన్ని పంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవాలు చేయగలుగుతున్నారు వైసీపీ కీలక నేతలు. ఈ క్రమంలోనే ఇక ఏకగ్రీవాల వ్యూహం  ఫలించక వైసీపీకి షాక్ తగులుతుంది.  అదే సమయంలో కర్నూలు జిల్లాలో పార్టీలో వర్గ పోరు రోజురోజుకి తారా స్థాయికి చేరుతుండటంతో.. అధికార పార్టీ పరిస్థితి అయోమయంలో పడి పోతుంది.  ఇక ఇటీవలే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారిపోయాయి.

 అయితే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో అటు ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య కాదు ఏకంగా..  అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎమ్మెల్యే ఆర్థర్.. జిల్లా వైసీపీ ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయుల మధ్య  పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ పెద్దలు కలగ చేసుకున్నప్పటికీ ఏకంగా ఇరువర్గాలు మంత్రుల ఎదుటే వాగ్వాదానికి దిగడం లాంటి ఘటనలు కూడా జరిగాయి.  ఇలా ప్రస్తుతం సొంత పార్టీలోనే వర్గపోరు తో వైసీపీ కొత్త తలనొప్పులు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం  పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకంగా తమ పార్టీలోని ప్రత్యర్థులను ఓడించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: