మిస్టరీ: జగన్‌ ఈ ప్రశ్నలు అడిగితే.. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఏం చెబుతాడో..?

Chakravarthi Kalyan
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. అప్పుడప్పుడు  సంచలన వార్తలు రాస్తుంటారు.. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి తెస్తుంటారు. ఇటీవల షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోందంటూ మొదట బయటపెట్టింది ఆర్కేనే.. అయితే అప్పట్లో దాన్ని వైసీపీ నేతలు ఖండించారు. కానీ.. చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. అందుకే ఇప్పుడు రాధాకృష్ణ  మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆదివారం కొత్త పలుకులో మరిన్ని కొత్త విషయాలు రాసుకొచ్చారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఓసారి తిరగేయొచ్చు.

అయితే ఈ కొత్త పలుకులో తన వాదనలను తానే కొన్ని సార్లు ఖండించుకున్నారు రాధాకృష్ణ. అనేక చోట్ల లాజిక్ మిస్సయ్యారు. మొత్తానికి జగన్‌ను బద్నాం చేసే ప్రక్రియలో కొన్నిసార్లు లాజిక్ మిస్సయ్యారు ఏబీఎన్‌ రాధాకృష్ణ.. అందులో మచ్చుకు కొన్ని చూద్దామా.. జగన్ 10 వేల కోట్ల ఆస్తిలో షర్మిల వాటా ఇవ్వడం లేదు అన్నది రాధాకృష్ణ బయటపెట్టిన ఓ పాయింటు..  మరి మీ యెల్లో క్యాంపే కదా లక్ష కోట్లు సంపాదించాడు జగన్ అని నోటి కొచ్చిన బురద అంతా తన మీద చల్లింది. గా తను సంపాదించిన దాంట్లో చెల్లెకు ఎందుకు వాటా ఇవ్వాలో చెప్పడం లేదు. అసలు వైఎస్ సీఎం అయ్యేముందు తన దగ్గర ఏమీ లేదని ఇదే రాధాకృష్ణ చాలాసార్లు రాసుకొచ్చారు. అంతా  ఆ తరువాత జగన్ సంపాదించిందే. మరి అలాంటప్పుడు ల్లెకు అందులో హక్కు ఎలా ఉంటుందన్నది అర్థం కాని ప్రశ్న.

అలాగే.. కేసీయార్ జగన్‌కు ఎన్నికల ముందు ఆర్థికసాయం చేశాడన్నది మరో పాయింటు. మరి లక్ష కోట్ల ఆసామీకి కేసీయార్ సాయం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? జగన్ మరీ కుమారస్వామి, దేవెగౌడలాగా పేదవాడయిపోయాడా..? అన్నది ఇంకో పాయింటు.. మరో చోట..  ఏపీలో పార్టీ పెడితే అన్నకు నష్టం కాబట్టి, వైసీపీ వాళ్లు కోరినా షర్మిల తిరస్కరించింది అని రాసుకొచ్చారు. మరి  అసలు అన్నకు గుణపాఠం చెప్పాలనే ఆమె పార్టీ పెడుతున్నప్పుడు  అన్నకు నష్టం కాబట్టి ఏపీలో పార్టీ పెట్టడం లేదు అనే వాదనకు అర్థం ఉందా.. ఏంటో రాధాకృష్ణ రాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: