ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన సీఎం.. అన్ని ఆశలు వారిపైనే..?

praveen
మరికొన్ని రోజుల్లో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే పంజాబీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు వ్యూహాత్మకం గానే పావులు కదుపుతున్నాయి. అయితే ప్రస్తుతం రైతు ఉద్యమం జరుగుతుంది అనే విషయం తెలిసిందే. రైతు ఉద్యమాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి అయితే ప్రస్తుతం రైతు ఉద్యమం బిజెపికి వ్యతిరేకం గా జరుగుతుంది కాబట్టి దాదాపుగా రైతు సంఘాలు బిజెపికి ఓటు వేసే అవకాశం లేదు ఇక ప్రస్తుతం అవకాశం ఉంది.. కేవలం కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే.

 ఈ క్రమం లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని ఈ రెండు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్ లలో  ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించి తీరాలి అని వ్యూహాత్మకంగానే ముందుకు  కదులుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతు సంఘాలు చేపడుతున్న ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు.

 గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో మిగతా చిన్న చిన్న పార్టీలకు ఆమ్ఆద్మీ పార్టీ పోటీ ఇవ్వగలిగింది కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇక ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో.. ప్రస్తుతం ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న తాహిర్ హుస్సేన్.  రాకేష్ తికాయత్ లను తమ వైపుకు తిప్పుకుంటుంది.  ఈ క్రమంలోనే వీరికి  న్యాయ సహాయం ఆర్థిక సహాయం చేస్తూ ఉంది కేజ్రీవాల్ పార్టీ. ఈ విషయాన్ని ఏకంగా ఆమ్ ఆద్మీ  పార్టీ నేతలే చెబుతూ  ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఆశించినట్లుగా పంజాబ్లో మంచి ఫలితం వస్తుందా రాదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: