డ్రాగన్ కంట్రీకి తిక్క కుదిరినట్టుంది..!

NAGARJUNA NAKKA
గత కొద్ది రోజులుగా చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే ప్రస్తుతం చైనా వెనక్కి తగ్గింది. సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటనచేశారు. భారత్‌లోని తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది.
సరిహద్దు వివాదంలో చైనా వెనక్కి తగ్గింది. తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తెలిపింది. బలగాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో కమాండర్ల స్థాయి చర్చలు ఫలించాయి. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది. గాల్వాన్‌ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారడం.. ఎప్పుడైనా యుద్ధం జరగొచ్చనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌ తన దళాలను మోహరించింది. ఇరు దేశాల సైనికులు ఎదురు దాడులు కూడా చేపుకున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చైనా అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ఘటన నుంచి ఇరు దేశాల సైనికాధికారులు చేస్తున్న చర్చలు ఇప్పటికి ఫలించాయి. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.
చైనా గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసింది. అయితే ఆ నిర్ణయాలు ఎక్కువ రోజులు పాటించలేదు. తిరిగి కొద్ది రోజులకే భారీగా సైన్యాన్ని మోహరించింది. దీంతో భారత్‌ కూడా ధీటుగా బదులిచ్చింది. తాజాగా చైనా నిర్ణయంపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చైనా... భారత్‌ను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: