బ్రాహ్మ‌ణ ఘోష‌: దేవ‌దాయ మంత్రి ప‌ద‌వి.. ఈ సారి బ్రాహ్మ‌ణుల‌కే.. వైసీపీలో చ‌ర్చ..!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో దేవ‌దాయ శాఖ మంత్రిప‌ద‌విని బ్రాహ్మ‌ణుల‌కు ఇవ్వాలి!- ఈ వాద‌న‌.. ఈ డిమాండ్‌.. కొన్నాళ్లుగా వినిపిస్తోంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే ఒక్క‌సారి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఈ ప‌ద‌వి ద‌క్కింది.  అది కూడా ఉమ్మ‌డి ఏపీలో. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో పైడికొండ‌ల మాణిక్యా ల‌రావు.. దేవ‌దాయ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న దేవ‌దాయ శాఖ‌లో స‌మూల మార్పులు తెచ్చారు. పైగా హిందూ ధ‌ర్మంపై ఆయ‌న‌కు అచెంచ‌ల విశ్వాసం ఉంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఆ త‌ర్వాత‌.. బీజేపీ.. టీడీపీతో తెగ‌తెంపులు చేసుకున్న త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర పాటు ఈ ప‌ద‌వి ఖాళీగానే ఉండిపోయింది. దీనిని చంద్ర‌బాబు త‌న‌వ‌ద్దే పెట్టుకున్నారు. కేవ‌లం అప్ప‌టి దేవ‌దాయ క‌మిష‌న‌ర్ ప‌ద్మ ద్వారానే అన్నీ న‌డిపించారు. దీంతో రెండో సారి ఎవ‌రూ మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌లేదు. ఇక‌, వైసీపీ స‌ర్కారులో ఇద్ద‌రు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచినా. వారిని ప‌క్క‌న పెట్టివైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వెలంప‌ల్లి శ్రీనివాస్‌ను మంత్రిని చేశారు. అయితే.. శ్రీనివాస్‌కు గ‌తంలోను.. ఇప్పుడు కూడా దైవ భ‌క్తిక‌న్నా కూడా రాజ‌కీయాల‌పైనే ప్రాధాన్యం ఉంది. దీంతో ఆయ‌న ఎక్క‌డ ఎప్పుడు నోరు తెరిచినా.. రాజ‌కీయాలకే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఫ‌లితంగా దేవ‌దాయ శాఖ మంత్రిగా వెలంప‌ల్లిని ప‌క్క‌న పెట్టాల‌నే డిమాండ్లు.. గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇక‌, విజ‌య‌వాడ‌కు చెందిన సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు.. ఈ పోస్టు కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈయ‌న‌కు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఈయ‌న మ‌నసు మాత్రం దేవ‌దాయ మంత్రి పీఠంపైనే ఉంది. ఇదిలావుంటే. వెలంప‌ల్లిని మంత్రిగా కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు.

అయితే.. ఈయ‌న‌ను ఈ శాఖ నుంచి ప్ర‌స్తుతం మంత్రి పేర్ని నాని చూస్తున్న స‌మాచార పౌర సంబంధాల శాఖ‌కు మార్చి.. దేవ‌దాయ శాఖ‌ను మ‌ల్లాది విష్ణుకు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని .. వైసీపీ వ‌ర్గాల్లో టాక్‌. ఈ విష‌యంపై అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు కూడా ధ్రువీక‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే జ‌రిగితే.. బ్రాహ్మ‌ణుల‌తో ముడిప‌డిన‌.. దేవ‌దాయ శాఖ‌కు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు మంత్రిగా రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 
బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.

మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: