బంపర్ ఆఫర్.. రూ.లు 2499 కట్టి.. స్కూటీ ఇంటికి తీసుకెళ్లండి..?

praveen
ప్రస్తుతం టూవీలర్ వాహన తయారీ కంపెనీ  హోండా కంపెనీ వాహనాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే ఎక్కువమందికి హోండా వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. హోండా కంపెనీ అంటే ఒక మంచి బ్రాండ్ అన్నట్లుగా భావిస్తూ ఉంటారు ఎంతో మంది జనాలు. ఈ క్రమంలోనే హోండా కంపెనీ కి సంబంధించిన టు వీలర్ కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారూ. అయితే  ఒకవేళ మీరు టూవీలర్ కొనాలి అని ట్రై చేస్తూ ఉంటే మీ కోసం హోండా కంపెనీ ఒక అదిరిపోయే శుభవార్త ను సిద్ధం చేసింది.


 టూవీలర్ కొనాలి అనే ఆలోచనతో ఉన్నవారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. తమ కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా హోండా కంపెనీ పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.  హోండా కంపెనీ తయారు చేసిన పాపులర్  స్కూటర్ అయినా హోండా యాక్టివా సిక్స్ జీ పై పలురకాల ఆఫర్లను అందిస్తోంది. ఆన్లైన్ లోనే స్కూటర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు మరిన్ని రకాల బెనిఫిట్స్ కూడా తన కస్టమర్లకు అందిస్తుంది హోండా. ఏకంగా స్కూటర్ల దరపై  100 శాతం వరకు ఫైనాన్స్ సదుపాయం పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.

 అయితే స్కూటర్ ధరకు సమానమైన రుణాన్ని అందించడమే కాదు తక్కువ వడ్డీకి రుణం అందిస్తుంది హోండా కంపెనీ. 6.5  శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది.  ఇక మరో రెండు ఆఫర్లు కూడా తమ వినియోగదారుల కోసం సిద్ధం చేసింది హోండా కంపెనీ. కేవలం 2,499 రూపాయలు చెల్లించి స్కూటర్ ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగతా అమౌంట్ మొత్తం కోసం లోను తీసుకుని ప్రతి నెలా చెల్లిస్తే సరిపోతుంది. ఈఎంఐ రూపం  కొనుగోలు చేస్తే 5వేల వరకు క్యాష్బ్యాక్ కూడా లభిస్తుందట. ఇంకేంటి ఆలస్యం  ఒకవేళ మీరు స్కూటర్ కొనాలి అనుకుంటే ఇదే సదవకాశం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: