టీకా వేసుకున్నా.. పాజిటివ్ వచ్చింది.. ఆందోళనలో వైద్య సిబ్బంది..?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలందరిలో వ్యాక్సిన్ పై  వివిధ రకాల అనుమానాలు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్  సురక్షితమైనదేనా  అనే అనుమానం కలగగా..  వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అందరికీ అవగాహన కల్పించేందుకు ఎంతగానో చేపట్టారు అధికారులు.  అయితే వ్యాక్సిన్  తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీ బాడీలు పెరిగిపోతాయని  తద్వారా వైరస్ బారిన పడకుండా ఉంటారని వైద్య నిపుణులు చెప్పారు అన్న విషయం తెలిసిందే.

 అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందికి మళ్లీ కరోనా  పాజిటివ్ రావడం.. ఇక మరి కొంతమంది ఏకంగా ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ప్రజల్లో మరిన్ని సందేహాలు పెంచుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మంచిర్యాల జిల్లా కు చెందిన 8 మంది వైద్య సిబ్బంది కరోనా  వైరస్ బారిన పడడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల కరోనా  వైరస్ పాజిటివ్ వచ్చిన ఎనిమిది మంది వైద్య సిబ్బంది మొత్తం ఇరవై రోజుల క్రితమే వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం.

 మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిలో 8 మంది వైద్య సిబ్బందికి కరోనా  వైరస్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. వీరిలో  ఇద్దరు డాక్టర్లు ఉండగా ఆరుగురు  వైద్య సిబ్బంది. అయితే ఇక ప్రస్తుతం వైరస్ సోకిన వారు అందరూ 20 రోజుల కిందటే వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలుస్తోంది వేసుకున్న తర్వాత కూడా పాజిటివ్  రావడంతో ఇక ప్రజలందరిలో  ఈ వ్యాక్సిన్ పై మరిన్ని సందేహాలు పెరిగిపోతున్నాయి.  ఇక కరోనా  పాజిటివ్ వచ్చిన వారందరూ కూడా ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన వారే అన్నది ప్రత్యేక ఉప వైద్య  అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: