ఐడియా అదిరిపోయింది.. వరి పొట్టుతో లక్షలు సంపాదిస్తున్నాడు..

praveen
ప్రస్తుతం డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎంతో మంది వివిధ రూపాలలో  డబ్బులు సంపాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటే మరి కొంతమంది వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారూ. మరికొంతమంది వినూత్న రీతిలో డబ్బు సంపాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాగే చేసి కళ్లుచెదిరే విధంగా ఆదాయాన్ని సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కొత్త ఆవిష్కరణ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది
 బిబు సాహూ అనే వ్యక్తి ఒక టీచర్.

 అయితే 2007 సంవత్సరంలో ఉద్యోగం మానేసి అగ్రికల్చరల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను మెల్లగా రైస్ మిల్ వ్యాపారంలోకి కూడా వచ్చాడు.  అయితే ఇలా రైస్ మిల్ వ్యాపారంలో ప్రతి ఏడాది కూడా మూడు టన్నుల పొట్టు వచ్చేది.  ఇక దాన్ని వృధాగా ఊరి బయట కాల్చేసేవాడు. వాతావరణ కాలుష్యం జరుగుతు ఉండేది. దీంతో చుట్టుపక్కల ప్రజలు అందరూ రైస్ మిల్ పై ఫిర్యాదు ఇచ్చేవారు. అతని మనసులో ఒక ఆలోచన తట్టింది దీన్ని వృధాగా కాల్చేయకుండా దీనితో ఏదైనా చేయగలనా  అని ఆలోచించాడు.

 ఈ క్రమంలోనే వరిపొట్టు ను స్టీల్ పరిశ్రమలో ధర్మల్ ఇన్సులేటర్ గా వాడవచ్చు అని ఐడియా కు వచ్చి దీన్ని ఎలా అమలు చేయాలో అనేదానిపై  కొంత మంది నిపుణులను కలిసి వివరాలు తెలుసుకున్నాడు.  ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేసి విజయం సాధించాడు. చిన్నచిన్న గుళికలుగా  తయారు చేసి విదేశాల్లో కంపెనీలకు కలిసి ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. 2019 తొలిసారి  సౌదీ అరేబియా పంపించాడు.  ఇక ఈ ఏడాదిలోనే వంద టన్నుల గుళికల ద్వారా ఏకంగా 20 లక్షల వరకు సంపాదించాడు. దేనికి పనికిరాకుండా ఉన్న వరి పొట్టును బంగారంగా మార్చుకున్నాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: