టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....
ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. అలాంటి చదువు మనకు ఉపాధ్యాయుని ద్వారానే లభిస్తుంది. కాని అలాంటి ఉపాధ్యాయులను ఈనాడు ఎవరూ గుర్తించట్లేదు. సమాజానికి ఒక ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలన్న, పోలీస్ కావాలన్న ఖచ్చితంగా వారి వెనకాల ఉపాధ్యాయుడు వుండాల్సిందే.గుర్తించకపోయినా పర్లేదు కాని వాళ్ళు పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది నేటి సమాజంలో. ఎంతోమంది చదువుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. కాని ఆ చదువు నేర్పిన ఉపాధ్యాయుడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు.
ఇక లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా స్కూల్లు మూతపడిన సంగతి తెలిసిందే. స్కూల్లు మూతపడటం వల్ల చాలా మంది టీచర్లు ఉద్యగాలు లేక సరైన ఉపాధి లేక రోడ్డున పడటం జరిగింది. చాలా మంది తినటానికి తిండి లేక డబ్బులులేక ఎంతో ఇబ్బంది పడ్డారు. అలా ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత వుంది. ఎందుకంటే ఒక టీచర్ బాగుపడితేనే రేపటి సమాజం బాగుపడుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...