తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు.?

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు.? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరైనా టిఆర్ఎస్ లేదా బీజేపీ పేర్లు చెబుతారు. కానీ తాజాగా ఓ సర్వేలో ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన దుబ్బాక బై ఎలెక్షన్, గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కాషాయ జండాని ఎగరవేసింది. టిఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభావం మాత్రం కనిపించలేదు. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని "సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సిఫాలజీ స్టడీస్" చేసిన సర్వేలో టిఆర్ఎస్ మూడో స్థానంలో నిలవగా  బీజేపీ విజయం సాధిస్తుందని..కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని ఫలితాలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పీడీఎఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో డిసెంబరు 28 నుండి జనవరి  సర్వేను నిర్వహించగా...సర్వేలో 1.80 లక్షల మందిని సర్వే చేశారట.
అయితే ఓటింగ్ షేరింగ్ విషయంలో ఈ సర్వే రిజల్ట్స్ ప్రకారం బీజేపీ కి 37.4 శాతం, కాంగ్రెస్ కు 31.8 శాతం ఓట్లు, టిఆర్ఎస్ కు 13.5 శాతం ఓట్లు పడతాయని..ఇక మజ్లీస్ కు 14.2 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అంటే టిఆర్ఎస్ కంటే మజ్లీస్ కే ఎక్కువ శాతం ఓట్లు పడతాయని సర్వే చెబుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా 0.9 శాతం ఓట్లు పడతాయని తేలింది. ఇక సీట్ల లెక్కన చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపికి 49-54 సీట్లు, కాంగ్రెస్ కు 43 నుండి 47 సీట్లు, టిఆర్ఎస్ కు 14 నుండి 16 సీట్లు, ఎంఐఎం కు 7 నుండి 10 సీట్లు, ఇతరులకు 0 నుండి 2 సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. అయితే సర్వే ఫలితాలు అయితే ఇలా ఉన్నాయేమో కానీ భయట పరిస్తుతులు మాత్రం అందుకు బిన్నంగా నే ఉన్నాయి. ఎక్కడ చూసినా టిఆర్ఎస్ బీజేపీ పేర్లే వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ రెండు పార్టీలే సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: