విధి ఆడిన వింత నాటకం.. బొమ్మ కోసం వెళ్లి డ్రమ్ములో పడిన చిన్నారి.. చివరికి.?

praveen
విధి ఆడిన వింత నాటకం లో మనుషులు అందరూ కీలు బొమ్మలే అని చెబుతూ ఉంటారు పెద్దలు. మనిషి బ్రతకాలి అని ఎంత పరితపించిన ప్పటికీ మనుషుల ప్రాణాలు ఎప్పుడూ తీసుకెళ్లాలి అన్నది ఆ పైవాడు నిర్ణయిస్తూ ఉంటాడు అని చెబుతుంటారు. కొన్ని కొన్ని జరిగే సంఘటనలు చూస్తూ ఉంటే పెద్దలు చెప్పింది ముమ్మాటికీ నిజం అనే  భావన కలగక మానదు. అంతా  సంతోషం గా సాగి పోతుంది అనుకుంటున్న తరుణం లో మృత్యువు ఒక్క సారిగా దూసుకు వచ్చి చివరికి కుటుంబం లో తీరని విషాదాన్ని నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అప్పటివరకు అంతా సంతోషం గా ఉండగా.. ఇక నిమిషాల వ్యవధి లోనే పూర్తిగా విషాదం నిండి పోతూ ఉంటుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దంపతులకు కూతురు పుట్టింది ఇక కూతురు పుట్టింది అని ఎంతో సంబరపడిపోయారు తల్లి దండ్రులు.ఇక ఎంతో అల్లారుముద్దుగా కూతురుని చూసుకుంటున్నారు. కానీ వారి ఆనందాన్ని చూసి విధి  ఓర్వ లేక పోయింది.  చివరికి ప్రమాదం రూపంలో కూతురి ప్రాణాలు తీసి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని  మిగిల్చింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. విధి ఆడిన వింత నాటకంలో అభం శుభం తెలియని ఆ చిన్నారి చివరికి అనంతలోకాలకు వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

 ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న చిన్నారి ఆడుకుంటున్న బొమ్మ డ్రమ్ములో  పడింది.. కుర్చీ ఎక్కి బొమ్మను తీసుకునే ప్రయత్నంలో డ్రమ్ములో పడిపోయింది చిన్నారి.  బయట ఆడుకుంటుంది లే అని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ తమ కూతురుఇలా విగతజీవిగా మారిపోతుంది అని మాత్రం ఊహించలేకపోయారు తల్లిదండ్రులు. శివంపేట మండలం లో ఉంటున్న మాధవి ఆంజనేయులు దంపతుల కూతురు జాహ్నవి ప్రమాదవశాత్తు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: