నిర్మలమ్మ ఆరు సూత్రాలు..!
కరోనాతో దేశ ఆరోగ్యవ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యరంగానికి ఒకటిన్నర శాతం నిధులు కేటాయిస్తే సరిపోదని.. మొదటి నుంచి ఆర్ధిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని.. రూ.2,23,846 కోట్లను హెల్త్‌కు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం ఎక్కువ. కరోనా వ్యాక్సిన్ కోసమే రూ. 35వేల కోట్లను కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్త్ భారత్ యోజన పథకానికి రూ.64వేల కోట్లు ఇచ్చారు. వీటితో పాటు మిషన్ పోషణ, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనివల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడులతో ఏడు టెక్స్‌టైల్ పార్కులను ప్రారంభిస్తామన్నారు నిర్మలా సీతారామన్. జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. లక్షా 18వేల కోట్ల మూలధనంతో జాతీయ రహదారులు, ఆర్థిక నడవాలను అభివృద్ధి చేయడం, రైల్వేలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు ఆర్ధిక మంత్రి. పంటలకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతున్నామని వివరించారు నిర్మలా సీతారామన్. హర్బర్ల అభివృద్ధి, వలస కార్మికులు, కూలీల కోసం వన్ నేషన్ - వన్ రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.
విద్య, నైపుణ్యాలకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వేల పాఠశాలలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100 సైనిక్ పాఠశాలలను నెలకొల్పనున్నారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లను ను ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలమ్మ.
పరిశోధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్ మిషన్ కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇన్నోవేషన్ కోసం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణలు తీసుకురావడానికి పలు చర్యలు తీసుకున్నామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి. పరిపాలనను సరళతరం చేస్తూ.. అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు.