జగడ్డ : కర్నూలులో ఆ పంచాయతీల్లో.. టిడిపి నేతలే లేరా..?

praveen
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మొత్తం ప్రస్తుతం హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా మూడేళ్ల వైసిపి పాలనకు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిలువుటద్దంగా మారబోతున్న నేపథ్యంలో ఇక వైసీపీ కీలక నేతలు అందరూ రంగంలోకి దిగి ఊహాత్మకంగా  అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో ఇక ప్రజల్లోకి జగన్ ప్రభుత్వ తప్పులను తీసుకెళ్ళి ఇక ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని పావులు కదుపుతున్నాయి.

 ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. అయితే ఇక కర్నూలు జిల్లాలో అయితే మరింత రసవత్తరంగా సాగుతుంది  రాజకీయం.  ఎవరికివారు గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారూ. ఇక ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది అన్న విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అధికార వైసిపి పార్టీ ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం వైసీపీ ఏకగ్రీవాలు చూస్తూ ఉంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు అని అందరూ ప్రశ్నించే విధంగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో కూడా పలు పంచాయతీలు ఏకగ్రీవం వైపు గా నడుస్తున్నాయి అన్నది అర్ధమవుతుంది.

 కర్నూలు జిల్లాలో లింగందిన్నె పంచాయతీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కేవలం అధికార వైసీపీ పార్టీకి చెందిన నేత నామినేషన్ వేశారు. ఇక ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.. ఇక ఉయ్యాలవాడ మండలం.. గోవింద పల్లె లో ఒకరు దొర్నిపాడు మండలం..  కొండాపురం పంచాయతీలో కేవలం వైసీపీకి చెందిన వారు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.  దీంతో అక్కడ ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయా పంచాయతీల లో అసలుప్రతిపక్ష టీడీపీ నేతలే  లేరా  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఉంటే ఎందుకు నామినేషన్లు వేయలేదు..  కారణం ఏంటి అన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: