కాపు వేద‌న‌: జ‌గ‌నోరికి గోదారి కాపుల రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఏపీలో కుల రాజ‌కీయం తారా స్థాయికి చేరుకుంది. సీఎం హోదాలో ఉండి కూడా జ‌గ‌న్ ఇత‌ర నేత‌ల‌ను విమ‌ర్శించేట‌ప్పుడు కులం పేరు పెడుతున్నారు. ఇక ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ మాత్ర‌మే కాదు.. ప్ర‌తిప‌క్ష టీడీపీని విమ‌ర్శించాల‌న్నా.. చంద్ర‌బాబును తిట్టాల‌న్నా కూడా ఎక్కువుగా కులం పేరే వాడుతోన్న ప‌రిస్థితి. జ‌గ‌న్ సీఎం అయ్యాక కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను ప‌ని క‌ట్టుకుని టార్గెట్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌గానే.. కాపుల‌కు కూడా ఈ ప్ర‌భుత్వంలో పెద్ద‌గా న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

పేరుకే న‌లుగురు కాపు మంత్రులు కేబినెట్లో ఉన్నా వారిలో ఏ ఒక్క‌రు బ‌ల‌మైన వాయిస్ వినిపించే వారు లేరు. పైగా త‌మ వ‌ర్గ ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడేంత క్యాప‌బులిటీ కూడా వీరికి లేదు. ఇక చంద్ర‌బాబు చివ‌రి కేబినెట్ స‌మావేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన 10 శాతం అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ల‌లో కాపుల‌కే ఏకంగా 5 శాతం కేటాయించింది. అయితే జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఈ 5 శాతం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయ‌డంతో కాపులు మంచి అవ‌కాశం కోల్పోయారు. క‌నీసం ఈ 5 శాతం రిజ‌ర్వేష‌న్లు ఉండి ఉంటే కాపుల్లో పేద‌ల‌కు విద్యా, ఉద్యోగ అవ‌కాశాల్లో మంచి అవ‌కాశం ఉండేది.

దీంతో కాపుల‌తో పాటు కాపు యువ‌త జ‌గ‌న్ స‌ర్కార్ పై గుర్రుగా ఉంది. ఇక గోదావ‌రి జిల్లాల‌తో పాటు అటు వైజాగ్‌లోనూ కాపు ఎమ్మెల్యేలు ఉన్నా వీరు జిల్లాల ఇన్‌చార్జ్ లు, ప‌రిశీల‌కు ల ఆధిప‌త్యంతో ప్ర‌శాంతంగా ఉండ‌లేక‌పోతున్నారట‌. ఇక కాపు ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా త‌మ వ‌ర్గం వారు వేస్తోన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. కాపుల ప‌నులు కూడా కావ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో అట్టుడుకుతోన్న కాపు వ‌ర్గం ఓట‌ర్లు స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీపై తిరుగులేని రివేంజ్ తీర్చుకుంటార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: