జగడ్డ: జగన్‌ని కాపాడుతూ... మనం ఇరుక్కుంటున్నామా..!
ఎవరైనా.. పరుషంగా మాట్లాడితే.. ఇకపై పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. బహుశ.. ఈ కారణంగానే అయి ఉంటుంది.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ.. తనపై వ్యక్తి గత విమర్శలు చేసేవారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎవరూ హద్దులు దాటొద్దని ఆయన సూచించారు. అంతేకాదు.. చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు. దీంతో ఈ విషయం.. వైసీపీ నేతల మధ్య చర్చనీయాంశం అయింది. కీలకమైన మంత్రుల మధ్య.. విజయవాడ నేతల మధ్య కూడా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.
``మన నాయకుడికి దూకుడు ఎక్కువ. ఆయనను కాపాడాలనేది మన ప్రయత్నం. ఈ క్రమంలో మన పీకలు తెగేలా ఉన్నాయే!!`` అని నాయకులు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా సీఎం జగన్ దూకుడును మొన్నటి వరకు సమర్ధించిన సదరు మంత్రి ఇప్పుడు .. ఏదేమైనా.. మనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి! అని అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ఇప్పటి వరకు ఏం జరిగినా.. సీఎం జగన్‌ను ఏమన్నా.. వెంటనే రియాక్ట్ అయిన.. సదరు మంత్రి వర్యులు.. ఇప్పుడు మాత్రం ఇలా వ్యాఖ్యానించడం వెనుక.. అంతరార్థం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఆ మాటకు వస్తే రాజధాని జిల్లాకే చెందిన మరో మంత్రి నిన్న మొన్నటి వరకు బలమైన వాయిస్ వినిపిస్తూ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఎన్నికలపై సుప్రీం ఇచ్చిన షాక్‌తో మంత్రుల గళం మారుతోందని అంటున్నారు పరిశీలకులు.