జగడ్డ: నోటి దూల కొంప ఆర్పేస్తుందా...?

అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత అధికార వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడానికి ఇబ్బందులు పడిన పరిస్థితి మనం చూసాం.  అమరావతిలో ఉద్యమం మొదలైన తర్వాత చాలా మంది అసలు ప్రజలతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించలేదు. మీడియా సమావేశంలో మాత్రం అధికార పార్టీ నేతలు పదేపదే విపక్షాలను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. అమరావతి ఉద్యమానిని కూడా కొంతమంది నేతలు చులకనగా మాట్లాడిన స్థితి మనం చూశాం. అయితే ఇప్పుడు ఉద్యమంలో ఎవరైతే వైసీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించలేదో వాళ్లందరికీ కూడా పంచాయతీ ఎన్నికల్లో కచ్చితంగా షాక్ తగిలే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల మీద అసహనం ఖచ్చితంగా పైకి కనబడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమరావతి మహిళలు ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మద్దతు ప్రకటించడం పక్కన పెడితే కనీసం అసలు ప్రజల ఆకాంక్ష కూడా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకువెళ్ళే పరిస్థితి లేదని చెప్పాలి. దీంతో చాలా మంది ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కూడా అధికార పార్టీకి ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు.
లేక సోషల్ మీడియాలో ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే వైసీపీ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అరెస్టు చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇలాంటి చర్యల ద్వారా పార్టీ ఇబ్బంది పడుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా కొంతమందికి వంత పాడటం కొంత మందికి ఇష్టం వచ్చినట్టు అధికారాలు ఇచ్చేయడంతో అమరావతి ఉద్యమం లో కొంతమంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితి ఉన్నా సరే కనీసం ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోకపోవడం తో గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఇబ్బంది పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: