జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

VUYYURU SUBHASH
అవును! ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జ‌గ‌న్ దూకుడును ప్ర‌తి ఒక్క‌రూ విమ‌ర్శిస్తున్నారు. పైకి మాత్రం జ‌గ‌న్‌ను పొగుతున్నా.. తెర‌వెనుక‌మాత్రం.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా తీవ్ర‌స్థాయిలో మ‌థ‌న ప‌డుతున్నారు. ``మేం.పార్టీనే న‌మ్ముకుని ఉన్నాం. పార్టీని న‌మ్ముకుని ప‌నిచేశాం. పార్టీ అదికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో కృషి చేశాం. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి వేరేలా ఉంది. మా నాయ‌కుడు.. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. త‌న దూకుడుతో ఏకంగా ప్ర‌భుత్వానికే ఎస‌రు పెట్టేలా ఉన్నాడు`` అని నాయ‌కులు లోలోన కుమిలిపోవ‌డ‌మే కాదు.. ఫోన్లు చేసుకుని చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.
ఇటీవ‌ల ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీలోని ఒక‌రిద్ద‌రు(జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు) మాత్ర‌మే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు.. వేసిన అడుగుల‌ను స‌మ‌ర్ధించారు. మిగిలిన వారు మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం ఏంటి? అనేది ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి పార్టీలో ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. సీనియ‌ర్ నాయ‌కులు మీడియా ముందుకు వ‌చ్చేవారు. త‌మ వాయిస్ వినిపించేవారు. జ‌గ‌న్‌పై మ‌చ్చ‌ప‌డ‌కుండా చూసుకునేవారు.
కానీ.. ఇటీవ‌ల రాజ్యాంగ వ్య‌వ‌స్థ అయినా.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌తో వివాదానికి దిగ‌డం, తెగేదాకా లాక్కోవ‌డం.. వంటిప‌రిణామాల‌తో వారు సైలెంట్ అయ్యారు. ``ఈ దేశంలో అనేక మంది నాయ‌కులు ఇంత క‌న్నా ఎక్కువ‌గానే బిరుసుగా వ్య‌వ‌హ‌రించారు. దీనికి ప్ర‌త్య ‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. పొరుగునే ఉన్న త‌మిళ‌నాడు. అక్క‌డ సీఎంగా చేసిన జ‌య‌ల‌లిత‌.. కూడా ఇంత క‌న్నా స్పీ డ్‌గానే వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఏమైంది?  ఆ ప‌రిస్థితి మాకు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు`` ఇదీ ఇటీవ‌ల వైసీపీ నేత‌ల చ‌ర్చ‌ల మ‌ధ్య వినిపించిన కీల‌క విష‌యం.
ఇక‌, ఇదేస‌మ‌యంలో కేడ‌ర్ కూడా పార్టీపై చ‌ర్య‌లు తీసుకుని, ప్ర‌భుత్వం ర‌ద్ద‌యితే.. ఏంటి ప‌రిస్థితి అని అంత‌ర్మ‌థ‌నంలోకి జారిపోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ ప‌రిణామాల‌తో .. న‌మ్ముకున్న వారిని.. జ‌గ‌న్ ముంచుతాడా?  తేల్చుతాడా? అనే చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. ఎన్నో ఏళ్ల‌పాటు ఎంతో మంది పార్టీ కోసం ఎంతో శ్ర‌మించిన విష‌యాన్ని.. జ‌గ‌న్ గుర్తు పెట్టుకోవాల‌నివారు కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: