ప్రపంచ క్రికెట్ లో ఇదే తొలిసారి.. ఇంగ్లాండ్ జట్టు అరుదైన రికార్డు..?

praveen
మొన్నటివరకు కరోనా  వైరస్ కారణంగా పూర్తిగా క్రికెట్ మ్యాచ్ లు  నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు బయో సెక్యూర్ బబుల్ పద్దతిని పాటిస్తూ తమ ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు పంపించడం.. వరుసగా సిరీస్ లు  ఆడించడం లాంటివి చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే అన్ని దేశాల మధ్య ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ లు మళ్లీ మొదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. దీంతో అటు క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఫుల్ టైం క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది.  ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లాండ్ మధ్య వరుసగా సిరీస్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం టెస్ట్ సిరీస్ లో  భాగంగా శ్రీలంక ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి.

 ఈ క్రమంలోనే అద్భుతం గా రాణిస్తున్న ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లో కూడా శ్రీలంక జట్టుపై ఆధిపత్యం సాధిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు బౌలింగ్ విభాగంలో  సత్తా చాటుతూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి  శ్రీలంక జట్టును ఇబ్బందులు పెడుతూ ఉంటే మరోవైపు బ్యాట్స్ మెన్లు స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తూ  భారీ స్కోర్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ విజయం దిశగా ఇంగ్లాండ్ జట్టు దూసుకుపోతుంది అనే చెప్పాలి.  ముఖ్యంగా శ్రీలంక ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో  ఇంగ్లండ్ జట్టు బౌలర్ల  ప్రదర్శన తీరు అసాధారణంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘనతను సాధించింది ఇంగ్లాండ్ జట్టు.  శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో రికార్డు సాధించింది.  ఒక ఇన్నింగ్స్ లో  పేస్ బౌలర్లతో 10 వికెట్లు..  మరో ఇన్నింగ్స్ లో స్పిన్ బౌలర్ లతో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఇంగ్లండ్ జట్టు. ఇలా పేస్ బౌలింగ్ తో ఒక ఇన్నింగ్స్ పది వికెట్లు.. మరో ఇన్నింగ్సులో స్పిన్ బౌలింగ్ లో 10 వికెట్లు తీసిన ఏకైక జట్టుగా ప్రపంచ క్రికెట్లో నే తొలిసారిగా చరిత్ర సృష్టించింది ఇంగ్లండ్ జట్టు. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఘనత సాధించ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: