ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా...?

VAMSI
19 ఏళ్ల బాలిక ముఖ్యమంత్రి అయింది. ఉత్తరాఖండ్‌ కి చెందిన శ్రిష్టీ గోస్వామి అనే 19 ఏళ్ల బాలిక ఆ రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాకపోతే ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే పరిమితం. విషయం ఏంటంటే... ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలోని దౌలత్‌పూర్ గ్రామాని కి చెందిన శ్రిష్టీ గోస్వామి అనే 19 ఏళ్ల బాలిక...జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తన కోరిక మేరకు ఆ రాష్ట్రానికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు వివిధ ప్రభుత్వ విభాగంలో అమలవుతున్న పథకాలపై ఆమె రివ్యూ చేపట్టారు.

రాష్ట్ర విధాన సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈమె కేదారపురం లోని బాలికా నికేతన్‌కు వెళ్లి అక్కడ పిల్లల్ని కలిసి వారితో కూర్చుని భోజనం చేశారు. తనకు ఈ అవకాశం దక్కడంపై శ్రిష్టీ గోస్వామి ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ...."జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా  నా కల నెరవేరడం ఎంతో సంతోషాన్ని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రిష్టీ. ఈమె తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈరోజు మేము చాలా గర్వంగా ఉన్నాం. తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలే కానీ ప్రతి కూతురు వారి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోగలదు.

శ్రిష్టీ గోస్వామి తండ్రి ఓ సాధారణ వ్యాపారి. ఈయన ఏమన్నారంటే..?? ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆడపిల్లలను ఏ మాత్రం తక్కువగా చూడకుండా వారికి మద్దతు పలుకుతూ.. వారి ఎదుగుదలకు ప్రతి ఒక్కరు వారి కూతుళ్లకు ప్రోత్సాహం అందించాలి అని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. సరిగ్గా అప్పటి తెలుగు సినిమా ఒకే ఒక్కడు లో ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు అలాగే జరగడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: