ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ పై పడుకున్న యువకుడు.. కానీ అంతలో ఊహించని షాక్..?

praveen
ఈ మధ్య కాలం లో క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు ఎంతో మంది జీవితాలను విషాదం లో పడేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎన్నో కుటుంబా లలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. చిన్నచిన్న కారణాలకే పెద్ద పెద్ద  తీసుకుంటూ చివరికి ఎంతో విలువైన ప్రాణాలను బలవన్మరణాల పేరుతో తీసుకుంటున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.  ఓ యువకుడు మనస్థాపం చెంది రైల్వే ట్రాక్ పై పడుకొని ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నాడు కానీ అదృష్టవశాత్తు చివరికి ప్రాణాల తో బయటపడతాడు.

 రైల్వే ట్రాక్ పై పడుకుని రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అనూహ్యం గా పోలీసులు ఎంట్రీ  ఇవ్వడంతో ఆ యువకుడికి భారీ షాక్ తగిలింది. చివరికి ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు. మరికొంత సేపట్లో రైలు వస్తుంది అనుకుంటున్న సమయంలో ఇక ఊహించని ఘటన చోటు చేసుకుంది.  గమనించిన స్థానికులు డైల్  100 కి  ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువత ఇలాంటి తరహా నిర్ణయాలు తీసుకుని చివరికి కుటుంబంలో విషాదం నింపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక సరైన సమయంలో స్పందించి ఇక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నా యువకుడి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని కమిషనర్ మహేష్ భగవతి అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: