గల్లా-రామ్మోహన్-కేశినేనిలు ఫిక్స్ అయిపోయారా ?

VUYYURU SUBHASH
2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ వేవ్ ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. వైసీపీకి భారీగా ప్రజల మద్ధతు వచ్చింది. దీంతో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చాయి. జగన్ సృష్టించిన ఈ చరిత్ర ఎప్పటికీ మరువలేనిది. ఇదే సమయంలో టీడీపీ చరిత్రలో లేని విధంగా ఓటమి పాలైంది. కానీ అంతటి జగన్ గాలిలో కూడా టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఇక ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీలోకి వెళ్ళిపోయారు.
ఇంకా ఎంతమంది వెళ్తారో కూడా తెలియదు.
కానీ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడటం కష్టం. అదే సమయంలో వారికి వైసీపీకి చెక్ పెట్టడం కష్టమే అని తెలుస్తోంది. ఇక ముగ్గురు ఎంపీలకు కూడా జగన్ చెక్ పెట్టలేరని తెలుస్తోంది. జగన్ గాలిని ఎదురుకుని గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. అయితే ఇప్పటికీ ఈ ముగ్గురు ఎంపీలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీరికి పార్టీ బలంతో పాటు, సొంత బలం కూడా ఉంది. అలాగే పార్లమెంట్‌లో వీరు రాష్ట్రం కోసం బాగానే పోరాడుతున్నారు.
అటు తమ పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వీరికి అపోజిట్ నిలబడి ఓడిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు అడ్రెస్ లేరు. అయితే పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే టీడీపీ ఎంపీలు వల్ల పార్లమెంట్ స్థాయిలో వైసీపీ బలపడటం లేదు.
ఆయా పార్లమెంట్ స్థానాల్లో ఉన్న ప్రజలు అసెంబ్లీ పరిధి వరకు కొంచెం అటూ ఇటూగా ఉన్నా, ఎంపీ విషయంలో మాత్రం మెజారిటీ ప్రజలు టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నట్లు కనబడుతోంది. దీని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో సైతం గల్లా-రామ్మోహన్-కేశినేనిల గెలుపు దాదాపు ఫిక్స్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మ‌రి ఈ ప‌రిణామాలు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఎలా ?  మార‌తాయో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: