అదరహో అనిపిస్తున్న బైక్ అంబులెన్స్.. ఫోటోలు వైరల్ ??

Satvika
ప్రస్తుత కాలంలో కంప్యూటర్ తో మనిషి పోటీ పడుతున్నారు. కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు. టెక్నాలజీ పెరగడం వల్ల మనుషులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అవసరాలకు తగ్గట్లు అబ్బురపరిచే బైకును రూపొందించారు. అంబులెన్స్ బైకును తయారు చేశారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్‌తో కలిసి బైక్ అంబులెన్స్‌ను డీఆర్డీవో రూపొందించింది. 



దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త బైకును తయారు చేసినట్లు డీఆర్డీవో పేర్కొన్నారు. చూడటానికి బుల్లెట్ బైక్ లా ఉంటుంది. ఈ బైక్ పై పడుకోవడానికి వీలుగా ఉంటుంది. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది.



అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక పోతే సమాచారం ఇస్తే వెంటనే ఆఫీసర్లు వచ్చి దగ్గరలోని ఆసుపత్రికి చేరవేస్తారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసింది. ఈ బైకు లో ఆక్సిజన్ వెసులు బాటు కూడా ఉంది. మామూలు అంబులెన్స్ లో ఉన్న సౌకర్యాలు అన్నీ కూడా ఈ బైకులో ఉండటం వల్ల ఈజీగా రోగులను దూర ప్రాంతాల నుంచి సురక్షితంగా చేరవేస్తున్నారు. ఈ అంబులెన్స్ బైకు లు ప్రజల అవసరం తీరుస్తుండతంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బైకులను భవిష్యత్తు లో దేశ వ్యాప్తంగా అందుబాటు లోకి తీసుకొస్తామని డీఆర్డీవో రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ బైకు అంబులెన్స్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: