ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండ‌గా జ‌నాలు ఎప్పుడో మ‌ర్చిపోయిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఒక్క‌సారిగా హైలెట్ అయ్యారు. కాపు ఉద్య‌మ‌నేత‌గా ముద్ర‌గ‌డ మ‌ళ్లీ ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానారు. టీడీపీ ఉన్న‌న్ని రోజులు ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఏదో ఒక హ‌డావిడి చేసిన ముద్ర‌గ‌డ ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే సెలెంట్ అయిపోయారు. మ‌ధ్య మ‌ధ్య‌లో కాపుల‌కు జ‌రుగుతోన్న అన్యాయంపై ఒక‌టి రెండు సార్లు సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసినా ఆ త‌ర్వాత గ‌ప్ చుప్ అయిపోయారు.

ఇక రాజ‌కీయంగా మ‌ళ్లీ ముద్ర‌గ‌డ యాక్టివ్ అయ్యే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఆయ‌న ఈ సారి బీజేపీ వైపు వెళ్లే అవ‌కాశాలున్నాయ‌న్న‌దే తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోన్న టాక్ ?  ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు-ముద్రగడ భేటి జరగబోతోందంటు ఒకటే ప్రచారం జరిగిపోతోంది. వాస్త‌వానికి ముద్ర‌గ‌డ ఒక‌ప్పుడు రాజ‌కీయంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన నేత‌. ఆయ‌న మాజీ మంత్రి.. మాజీ ఎంపీగా కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత పార్టీలు మారి రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు.

రాజ‌కీయంగా ఆయ‌న క్రియాశీల‌కంగా త‌ప్పుకుని చాలా రోజులే అయ్యింది. ఓ అవుట్ డేటెడ్ పొలిటిషీయ‌న్‌గా ముద్ర వేయించుకున్న ఆయ‌న వ‌ల్ల ఏ పార్టీకి ఒరిగేదేమి లేద‌ని అన్ని పార్టీలు డిసైడ్ అయిపోయాయి. ముద్ర‌గ‌డ‌కు ఏ పార్టీలోనూ పొస‌గ‌ట్లేదు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా ఏ విషయంలో అయినా తన మాటే చెల్లుబాటు కావాలని పంతానికి పోవటం లాంటి అనేక లక్షణాల వల్ల చివరకు ఏ పార్టీకి కాకుండా పోయారు. అయితే బీజేపీ మాత్రం ఏపీలో ప‌లువురు అవుట్ డేటెడ్ పొలిటిషీయ‌న్ల‌నే పార్టీలో చేర్చుకుంటోంది.

ఇప్పుడు వీళ్ల‌కు ముద్ర‌గ‌డ కూడా ఓ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నారు. మ‌రి ముద్ర‌గ‌డ బీజేపీలో ఇమ‌డ గ‌లుగుతారా ? ఆయ‌న కాషాయ రాజ‌కీయం కొన‌సాగేనా ? అన్న‌ది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: