కొత్త ఏడాదిలో బాగా సంపాదించాలా.. మీ కోసమే ఈ అదిరిపోయే డీల్స్..?

praveen
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీని కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటారు ప్రతి ఒక్కరు. అయితే 2020లో కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎంతో మంది ఈ కొత్త సంవత్సరంలో మాత్రం బాగా ఆదాయాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న వారికి ప్రస్తుతం ఒక అదిరిపోయే డీల్  అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్ ద్వారా భారీగా ఆదాయం పొందాలనుకునే వారికి ఇది సదవకాశం అని చెప్పాలి.

 స్టాక్ బ్రోకింగ్ సంస్థ జీసీఎల్  సెక్యూరిటీ ప్రకారం.. పలు ప్రభుత్వ స్కీమ్  ల వల్ల మార్కెట్లో లిక్విడిటి  ఎంతగానో ప్రారంభమైందట . ఈ క్రమంలోనే ఈ కొత్త సంవత్సరంలో ఈక్విటీ గోల్డ్ ప్రాపర్టీ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉందని జీసీఎల్  సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింగల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల స్టాక్ విలువ  అంతకంతకూ పెరిగిపోతున్నాయని అందుకే ఈ ఏడాదిలో ఐటి కంపెనీల స్టాక్స్ పై  పెట్టుబడి పెట్టడం మంచిదని సూచించారు. ప్రస్తుతం ఐటి కంపెనీలు వర్క్ ఫ్రమ్  హోం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక ఐటీ కంపెనీలకు ఖర్చు తగ్గి వాటా  ఆదాయం పెరుగుతుందని.. తద్వారా ఇన్వెస్టర్లు మంచి లాభం పొందే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు జి సి ఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింగల్.

 అదే సమయంలో 2020 సంవత్సరం లో పసిడి ధరలు పరుగులు పెట్టి ఆకాశాన్ని అంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం 27 శాతం మేర బంగారం ధర తగ్గింది. ఇక ఈ ఏడాది మళ్లీ పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ  క్రమంలోనే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పసిడిపై కూడా చేయడం వల్ల మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందట.  ఇక అంతే కాకుండా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టిన..  దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.  కొత్త ఏడాదిలో మంచి ఆదాయం పొందాలనుకునే వారు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: