కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయితే ఖ‌చ్చితంగా కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుంద‌న్న‌ది వాస్త‌వం. అదే జ‌రిగే అటు టీఆర్ఎస్‌తో పాటు ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌లోకి రావాల‌ని ఉత్సాహ ప‌డుతోన్న బీజేపీకి కొంత న‌ష్టం అయితే జ‌రుగుతుంది. రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు అయ్యి కాంగ్రెస్ పుంజుకుంటే బీజేపీకి దెబ్బ త‌ప్ప‌దు. ఇక రేవంత్ ప్ర‌స్తుతం మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ మళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌డం ఖాయం. అయితే ఈ సారి రేవంత్ త‌న కోడంగ‌ల్ నియోక‌వ‌ర్గానికి గుడ్ బై చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.
ఇక కేసీఆర్ సైతం రేవంత్‌ను కోడంగ‌ల్‌లో మ‌రింత వీక్ చేసేందుకు పావులు క‌దప‌డంతో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే పంతం వేసి మ‌రీ రేవంత్‌ను అక్క‌డ ఓడించారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అక్క‌డ రేవంత్ ప‌రిస్థితి క్రిటిక‌ల‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్ మూడు కొత్త మండ‌లాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వర్గానికి వరాల జల్లు కురిపించారు. మూడు కొత్త మండ‌లాలు ఏర్పాటు చేశారు. కొత్త మండలాలుగా 1) దుద్యాల్ 2)గుండుమల్ 3). కొత్తపల్లి ఏర్పాటు చేశారు.
ఇక నియోజ‌క‌వ‌ర్గంలో బొమ్రాస్‌పేట‌, దౌల‌తాబాద్ మండ‌లాల్లో కొత్త‌గా ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజ్‌లు ఏర్పాటుకు ఓకే చెప్పారు. కోస్గి మున్సిపాలిటీ ఆధునీకరణ లో భాగంగా రూ.10 కోట్లతో కోస్గి - సజ్జకాన్ పేట రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ఇక రేవంత్ మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా ఉండ‌డంతో కోడంగ‌ల్‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌ట్లేద‌న్న టాక్ ఉంది. ఇక రేవంత్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం ఉంది. దీంతో రేవంత్ దృష్టంతా అక్క‌డే ఉందంటున్నారు. అదే జ‌రిగితే రేవంత్ కోడంగ‌ల్‌కు దూర‌మైన‌ట్టే ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: