మోడీకే మ‌తిపోయేలా జ‌గ‌న్ రాజ‌కీయం.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ఎత్తు...!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాను ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌ను అని ముందు నుంచి చెపుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఇత‌ర పార్టీల్లోకి మారిపోతున్నారు. తెలంగాణ‌లో అయితే కేసీఆర్ గ‌త ఏడేళ్ల నుంచి వ‌రుస‌గా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూనే ఉన్నాడు. చివ‌ర‌కు బీజేపీ వాళ్లు, బీజేపీ ముఖ్య‌మంత్రులే కాకుండా.. ప్ర‌ధాన‌మంత్రి మోడీ సైతం ఏ మాత్రం సంకోచించ‌కుండా .. ఇత‌ర పార్టీల ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను బీజేపీలో చేర్చుకునే విష‌యంలో కూడా ఎంక‌రేజ్ చేస్తోన్న ప‌రిస్థితే ఉంది.

క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌లో బీజేపీ ఇలాంటి కుటిల రాజ‌కీయ నీతిని ప్ర‌యోగించే అక్క‌డ ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేసింది. రాజ‌స్తాన్‌లోనూ ఇదే త‌ర‌హా ప్ర‌యోగం చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ఇప్పుడు బెంగాల్లోనూ టీఎంసీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కాషాయ కండువాలు క‌ప్పేస్తూ .. అక్క‌డ భారీగా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. చివ‌ర‌కు తృణ‌మూల్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు సైతం కాషాయ కండువాలు క‌ప్పేస్తున్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం ఇత‌ర పార్టీల గుర్తుపై గెలిచిన వాళ్ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోన‌ని ముందు నుంచే చెపుతూ వ‌స్తున్నారు.

అయితే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర అయినా.. వారికి మాత్రం ఏ  నాడు జ‌గ‌న్ త‌మ పార్టీ కండువాలు క‌ప్ప‌లేదు. ఇక కొంద‌రు ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు త‌మ ప‌ద‌వులు వదులుకుని వ‌చ్చాకే వారిని పార్టీలో చేర్చుకుని.. తిరిగి వారికే ఎమ్మెల్సీ సీటు ఇచ్చే కొత్త రాజ‌కీయానికి జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ టీడీపీకి రాజీనామా చేయ‌డంతో పాటు ఆ పార్టీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్సీ వ‌దులుకున్నారు. చివ‌ర‌కు ఆ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఆయ‌న‌కే సీటు ఖ‌రారు చేశారు.

ఇటీవ‌ల టీడీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ తిరిగి ఆమెకే కేటాయించారు. ఈ రోజు పోతుల సునీత సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి బీ ఫారం తీసుకున్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు సునీత సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ఎవ్వ‌రూ చేయ‌ని కొత్త త‌ర‌హా రాజ‌కీయానికి జ‌గ‌న్ శ్రీకారం చుట్ట‌డంతో పాటు ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: