అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేయండి.. కార్ ఇంటికి తీసుకెళ్లండి..?

praveen
కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారు సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మీరు కూడా ఇలా కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే మీకు ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.. ఏదైనా కార్ల తయారీ కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తుందేమో అని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.  ఎందుకంటే మీరు కారు కొనకుండా ఇంటికి కారు తీసుకెళ్లే  ఒక అదిరిపోయే అవకాశం మీ కోసం సిద్ధంగా ఉంది.  దీనికోసం మీరు ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు ఎంతో సింపుల్గా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.

 రీఛార్జ్ చేసుకోవడం వల్ల కారు  నిజంగానే వస్తుందా అని అంటారా.. మీకు లక్కు  కలిసి వచ్చింది అంటే నిజంగానే రీచార్జ్ చేసుకొని ఇంటికి కార్  తీసుకు వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు టాటాస్కై డిటిహెచ్ వాడుతూ ఉంటే కారు  గెలుచుకునే ఛాన్స్ ఉంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐదు వందల రూపాయలతో రీఛార్జి చేసుకోవడమే. ఇలా మీరు టాటా స్కై అకౌంట్ ను 500 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇక మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఎస్ఎంఎస్ పై క్లిక్ చేయగానే.. ఒక ప్రశ్న వస్తుంది ఇక ఆ ప్రశ్నకు సింపుల్గా సమాధానం చెప్పేశారు అంటే చాలు ఇక మీరు కారు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో టాటా స్కై వాడుతున్న వారందరికీ కూడా ఈ సదవకాశం అందుబాటులో ఉంది. అయితే ఫిబ్రవరి 6 లోపు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా ఐదు వందల రూపాయలతో రీఛార్జి చేసుకొని ఎస్ఎంఎస్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి కార్  గెలుచుకున్నారు అంటే.. టాటా మోటార్స్ కి  చెందిన టియాగో కారు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూమ్ ద్వారా 4.7 లక్షల గా ఉంది. ఇక మీరు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే కాస్త లక్కు కలిసి వచ్చిందంటే చాలు 500 రూపాయలు రీఛార్జ్ తో ఈ కారు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: