వైసీపీలో రోజానే కాదు.. చెవిరెడ్డిని కూడా తొక్కేస్తున్నారా... కొత్త ఫైట్‌...!

VUYYURU SUBHASH
ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో రోజు రోజుకు వివాదాలు ముదురు తున్నాయి. పార్టీ నేత‌ల్లో మంత్రులు ఎమ్మెల్యేలు, మంత్రులు వ‌ర్సెస్ ఎంపీలు.. ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ముఖ్యంగా గ‌త నాలుగైదు నెల‌లుగా ఈ గొడ‌వ‌లు తీవ్రం అవుతున్నాయి. ఇక కొంద‌రు మంత్రులు సీనియ‌ర్ల‌ను సైతం అణ‌గ దొక్కే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా పార్టీ వ‌ర్గాల్లో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఇప్ప‌టికే చాలా గ్రూపులు ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తీరుతో చాలా మంది విసిగిపోయి ఉన్నారు.

న‌గ‌రి ఎమ్మెల్యే రోజా అయితే పెద్దిరెడ్డిని వీలున్న‌ప్పుడ‌ల్లా ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తితితో ర‌గిలి పోతున్నార‌ట‌. చెవిరెడ్డి జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న వెంట న‌డిచారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉండానే నాటి అధికార టీడీపీ, చంద్ర‌బాబుపై ఎంత గ‌ట్టిగా ఫైట్ చేశారో తెలిసిందే. పైగా చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన చంద్ర‌గిరి నుంచి ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు గెలిచారంటే మామూలు విష‌యం కాదు.

అలాంటిది చెవిరెడ్డి మంత్రి ప‌ద‌వి ఆశించినా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి కేబినెట్ బెర్త్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు రెండు నామినేటెడ్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి సంతృప్తి ప‌రిచారు. అన్నీ బాగానే ఉన్నా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో జిల్లాకే చెందిన మ‌రో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహించలేక పోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల జ‌గ‌న్ దృష్టికి కూడా తీసుకు వెళ్లిన‌ట్టు టాక్ ?  అంతెందుకు పెద్దిరెడ్డి న‌గ‌రి, చంద్ర‌గిరి మాత్ర‌మే కాదు జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాళ్లు, వేళ్లు పెడుతండ‌డంతో ఆ ఎమ్మెల్యేలంతా ర‌గిలి పోతున్నారు.

చివ‌ర‌కు చెవిరెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పెద్దిరెడ్డి జోక్యం చేసుకుని ఆయ‌న‌కు కూడా ఇబ్బందులు క‌లిగిస్తుండ‌డంతో చెవిరెడ్డి త‌ట్టుకోలేక‌పోతున్నార‌న్న చ‌ర్చ‌లు స్థానికంగా వ‌స్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ జోక్యం చేసుకోక‌పోతే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి దెబ్బ పార్టీకి త‌ప్ప‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: