ఆ టీడీపీ సీనియర్ ఆ భయంతోనే మారిపోయాడా.... జగన్ దెబ్బ మామూలుగా లేదుగా...!
పైగా కొందరు టీడీపీ స్థానిక నేతలు అశోక్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే.. అన్నీ ఉన్న ఆకు మాదిరిగా అశోక్ మౌనం పాటించారు. ఎక్కడా నోరు విప్పలేదు. విమర్శలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పార్టీలో ఇక, ఆయన హవా అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇంకేముంది.. నిన్న మొన్నటి వరకు పార్టీని వాడుకున్నారు. ఇప్పుడు అవసరం వచ్చే సరికి మాత్రం మౌనం పాటిస్తున్నారు.. అంటూ.. కొందరు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే.. వీటికి కూడా అశోక్ ఎక్కడా రెస్పాండ్ కాలేదు.
కానీ, ఇప్పుడు తనదైన శైలితో వ్యవహరించారు. నిదానమే ప్రధాన మనే ఫార్ములాను పాటించారు. సమయం చూసుకుని మీడియా ముందుకు వచ్చారు.
ఇప్పటకీ ఆయన తనపై విమర్శలకు స్పందించకపోతే రాజకీయంగాను.. ఇటు సొంత పార్టీలో వెనకపడిపోతానన్న ఆందోళనతోనే ఆయనకు బయటకు వచ్చినట్టు కనపడుతోంది. ఇప్పుడు ఆయనకు జిల్లా ప్రజల నుంచి పాజిటివ్ కామెంట్లు పడుతున్నాయి. ఇటీవల రామతీర్థంలో రాముల వారికి జరిగిన ఘోర పరాభవం తర్వాత.. విజయనగరంలో రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీపై విమర్శలు చేసేందుకు అప్పటి వరకు టీడీపీ పదవుల కోసం కొట్టుకున్న చాలా మంది నాయకులు ఒక్కరూ ముందుకు రాలేదు. కానీ.. అశోక్ మాత్రం నేనున్నానంటూ.. ముందుకు వచ్చారు. చంద్రబాబు పర్యటనలో అన్నీ తానై వ్యవహరించారు. నేరుగా ఆలయానికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను కూడా తెలుసుకున్నారు.
ఇక, అక్కడితో ఊరుకోకుండా.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జరిగిన ఆలయాలపై దాడులను వివరిస్తూ.. దాదాపు పది నిముషాల వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ క్రమంలో పార్టీలకు అతీతంగా అందరినీ కదిలించేలా అశోక్ గజపతి రాజు చేసిన ప్రసంగానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు విజయనగరం టీడీపీలో మళ్లీ అశోక్ ప్రస్థానం.. యథాతథమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నాయకుడు అవసరమనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.