గుడ్ న్యూస్.. ఎల్ఐసి మరో సదవకాశం.. త్వరపడండి..?

praveen
ప్రస్తుతం దేశీయ ప్రభుత్వరంగ అతిపెద్ద భీమాసంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కస్టమర్లకి ఎన్నో మెరుగైన సర్వీసులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ సర్వీసులను మరింత మెరుగు పరుచుకుంటూ ఇక తమ కస్టమర్లకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వివిధ రకాల పాలసీలను అందుబాటులో ఉంచింది.  ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీకి అనుగుణంగా తమ కస్టమర్లకు  ప్రయోజనం చేకూరే విధంగా వినూత్నమైన పాలసీలను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.

 ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న వివిధ రకాల పాలసీల ద్వారా ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమ కస్టమర్లకు శుభవార్త చెబుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఇటీవలే మరోసారి కీలక నిర్ణయం తీసుకొని పాలసీదారులు  అందరికీ శుభ వార్త చెప్పింది.  ఎంతోమంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో వివిధ రకాల పాలసీలు తీసుకొని ఇక ఆ తర్వాత అవి వివిధ కారణాలతో పాలసీ  రద్దు కావడంతో నిరాశ చెందుతుంటారు అనే విషయం తెలిసిందే.  అలాంటివారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవలే శుభ వార్త చెప్పింది.

 ఒకవేళ పాలసీదారుల పాలసీలు వివిధ కారణాలతో రద్దయితే ఇక వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. రద్దయిన పాలసీల పునరుద్ధరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అయితే దీనిపై మార్చి 6వ తేదీ వరకు పాలసీదారుల అందరికీ అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. మార్చి 6వ తేదీ వరకు కూడా రద్దయిన పాలసీల పునరుద్ధరణ చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలిపింది. ఇక గత ఏడాది కూడా ఎల్ఐసి పాలసీ దారులు అందరికీ రద్దయిన పాలసీల పునరుద్ధరణ చేసుకునేందుకు ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ అవకాశాన్ని కల్పించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: