చాపకింద నీరులా కరోనా స్ట్రెయిన్..!
కొత్త రకం వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్ పార్క్‌లు పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్ ప్రభుత్వం. ఇప్పటి వరకు కాస్త తక్కువ వ్యాప్తి ఉన్న ఐర్లాండ్‌లోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.
అటు అమెరికాలో కరోనా స్ట్రెయిన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయ్. ఇప్పటికే ఈ వైరస్ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న అమెరికాలో ఈ కొత్త రకం మరింత కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా పేషెంట్లతో ఇప్పటికే నిండిపోయిన హాస్పిటల్స్‌కు ఇది పెనుసవాల్‌గా మారనుంది.
వియత్నాంతో తొలి కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు నుంచి కొత్త రకం వైరస్ సోకింది. వెంటనే ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నిషేధించింది. యూకే నుంచి వచ్చే తమవారి కోసం మాత్రమే ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది.
మరోవైపు వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటి నాలుగు కోట్ల మందిపైకా వ్యాక్సిన్ అందజేశారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు పదిలక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందజేశారు.కొత్త వైరస్‌నూ ఈ వ్యాక్సిన్లు కట్టడి చేస్తాయని భావిస్తున్నప్పటికీ.. అందరికీ వ్యాక్సిన్ అందేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది.