గుడ్ న్యూస్.. రేషన్ బియ్యం డోర్ డెలివరీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

praveen
జగన్ సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నది అన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీల ను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న జగన్ సర్కార్..  అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పాలన సాగిస్తున్నది అన్న విషయం తెలిసిందే.  అదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే పాలన సాగిస్తున్నారు.

 ఇటీవలే ఏపీ ప్రజలందరికీ మరో శుభవార్త చెప్పింది జగన్ సర్కార్.  సాధారణంగా పేద ప్రజలకు ప్రభుత్వం ప్రతి నెల రేషన్ అందిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. రేషన్ ద్వారా బియ్యం అందించడంతో పాటు పలు రకాల నిత్యావసర లను కూడా అందిస్తూ ఉంటారు.  అయితే ప్రజలు అందరూ ఇలాప్రతి నెల రేషన్ తీసుకోవడానికి పెద్ద క్యూ కట్టి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ప్రస్తుతం కరోనా  వైరస్ టైంలో అయితే క్యూలలో నిలబడాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

 ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అన్ని తొలగిపోయేలా చేసేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. రేషన్ బియ్యం నిత్యవసర వస్తువులను ఫిబ్రవరి 1 నుంచి డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి మూడవ వారంలో వాహనాలను ప్రారంభించనుంది  జగన్ సర్కారు. ఇక అదే రోజున పది కేజీల బియ్యం బ్యాగ్ లను  కూడా ఆవిష్కరించనున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వాహనాల లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ప్రస్తుతం జగన్ సర్కార్ కసరత్తులు ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: