నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కాంగ్రెస్‌లో చర్చ..!
దానికి తోడు ఈ మధ్య జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడడం... పార్టీ మళ్ళీ పునర్వైభవం తిరిగి పొందడం కష్టమే అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన సత్తా చాటేందుకు కావాల్సిన రంగం సిద్ధం చేస్తోంది. ఏ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది... ఎక్కడ లేదు... ఇటువంటి సమాచార సర్వేలు చేస్తోందట. దాన్నిబట్టి ఇక ముందు పార్టీలో చేయాల్సిన మార్పులను చేర్పులను నేతలు అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసం ఓ సర్వే నిర్వహించగా.. అందులో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి రంగంలోకి దిగితేనే ఆశించిన మెజారిటీ వస్తుందని సర్వేలో తేలిందట. కానీ జానారెడ్డి మాత్రం అంత ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.
తనకు బదులు తన కుమారుడిని బరిలోకి దించాలని యోచిస్తున్నారట. కానీ సర్వే నివేదిక ప్రకారం అక్కడ జానారెడ్డి పోటీ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని గట్టిగా చెబుతున్నారు. కాబట్టి పార్టీ పెద్దలు జానారెడ్డి తో మాట్లాడి ఉప ఎన్నికల కోసం నిలబడేలా చేస్తారని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలవడం... కాంగ్రెస్ కు చాలా అవసరం. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి సాగర్ గెలుపు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి కొంతవరకు పార్టీకి బలాన్ని సమకూర్చగలదు అందుకనే ఈ ఉప ఎన్నికల కోసం అంతగా ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ.