కోడి కూర కోసం గొడవ.. మర్మాంగాలపై తన్నడంతో.. చివరికి.?

praveen
రోజు రోజుకు మానవత్వం ఉన్న మనుషులు కరువై మృగాలు గా మారుతున్న మనుషులే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  రోజు రోజుకు తెర  మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇది నిజం అని నమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చిన్నచిన్న కారణాల తోనే దారుణం గా ఉన్మాదులు గా మారి పోతున్న మనుషులు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెను కాడడం లేదు.  క్షణి కావేశంలో దారుణం గా హత్య లకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

 రోజు వారి కూలీ ల మధ్య కోడి కూర కోసం తలెత్తిన గొడవ కాస్త ఏకంగా ఒకరి  ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం లో వెలుగులోకి వచ్చింది. కూలి పనులు చేసుకునే ఐదుగురు వ్యక్తులు ఒకేచోట నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే వాళ్ళ మధ్య కోడి కూర కోసం గొడవ జరిగింది. ఇక కోడి కూర కోసం వీరి మధ్య తలెత్తిన గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చింది.

 దీంతో అప్పన్న అనే వ్యక్తిని నక్క ప్రసాద్ అనే మరో వ్యక్తి దారుణంగా కొట్టి చంపాడు. ఇక మిగిలిన ముగ్గురు కూడా ప్రసాద్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో వారు కూడా భయపడి పోయి అక్కడి నుంచి పారిపోయారు. ఇక అప్పన్నను కొట్టి మర్మాంగాలపై తన్ని హతమార్చిన ప్రసాద్ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టాడు. ఇక విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు.  ఇక రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు నిందితుడు పరారీలో ఉండగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: