వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకత్వం.. అసలు విషయం చెప్పిన డిసిఐజి..?

praveen
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఏదైనా చేశాయి అంటే దానిపై తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంది నెటిజన్లు ప్రజలందరినీ గందరగోళానికి గురి చేయడానికి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే భారత ప్రభుత్వం రెండు రకాల వ్యాక్సిన్ లను  భారత్లో అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలందరికీ శుభవార్త అందించింది.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎంతో మంది వివిధ రకాల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఉండగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

 కరోనా వ్యాక్సిన్ పై  సమాజ్వాదీ పార్టీ నేతలు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ వ్యాక్సిన్ పై  తమకు నమ్మకం లేదని వ్యాక్సిన్ను తాను వేసుకోను అంటూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. తాము   అధికారంలోకి రాగానే నాణ్యమైన సురక్షితమైన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.  అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆశుతోష్ సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు.  మోడీ తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ పురుషులను  నపుంసకులను  చేస్తోంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రజలందరూ అయోమయంలో పడిపోయారు.

 అయితే సమాజ్వాది పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. వ్యాక్సిన్  విషయంలో రాజకీయాలు ఏంటి అంటూ ప్రస్తుతం మండిపడుతున్నారు బీజేపీ నేతలు అయితే...  ప్రజల అనుమానాలు అన్నింటికీ తొలగించేలా ఇటీవలే డి సి జి ఐ స్పష్టత ఇచ్చింది.  భద్రతా పరమైన అంశాలనుపరిశీలించిన తర్వాతనే వ్యాక్సిన్ లకు  ఆమోదిస్తామని.. వ్యాక్సిన్లు 110% సురక్షితమైనవని.. ఏ యాక్షన్ తీసుకున్న జ్వరం నొప్పి వ్యాక్సిన్  లాంటివి సైడ్ ఎఫెక్ట్ సర్వసాధారణం అంటూ డి సీ ఐజి స్పష్టత ఇచ్చింది. వ్యాక్సిన్  తీసుకుంటే నపుంసకత్వం వస్తుందన్న వార్తలో నిజం లేదు అంటూ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: