పాకిస్థాన్ లో ఘోరం.. బయటపడ్డ నిజం.. ప్రతి ఏటా వెయ్యి మంది బాలికలు..?

praveen
పాకిస్తాన్లో ప్రజల హక్కుల పరిస్థితి అధ్వానం గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  మెజారిటీల  పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మైనారిటీల పరిస్థితి మాత్రం ఎంతో దీనం గా ఉంటుంది పాకిస్తాన్ లో . పాకిస్తాన్ లో ఉన్నటు వంటి మైనారిటీల ను ఏకంగా మనుషులు గా కూడా చూడటానికి అక్కడ మెజారిటీ ప్రజలు ఇష్ట పడరు.  ఈ క్రమం లోనే మైనారిటీ ప్రజల విషయం లో ఎన్నో దారుణాల కు పాల్పడుతుంటారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమం లోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల ను మతం మార్పిడి చేసుకొనేలా ప్రస్తుతం అక్కడ ఎన్నో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 ఈ క్రమం లోనే ప్రతి ఏటా వేల మంది హిందువుల ను మతమార్పిడి చేస్తున్నట్లు ఇటీవల పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన సర్వేలో  నిజాలు వెల్లడయ్యాయి. పేద మైనార్టీల నే టార్గెట్ గా చేసుకుని ఇలా బలవంతంగా మతమార్పిడి చేయిస్తున్నారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి మెజార్టీ హిందువులు ఏకంగా ఇస్లామిక్ మతం లోకి కన్వర్ట్ అవుతున్నారు అని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదికలో  తెలుస్తోంది. ఏటా వెయ్యి మంది బాలికలు బలవంతంగా ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేయబడుతున్నారట.


 ముఖ్యంగా సింధు ప్రావీన్స్  ప్రాంతంలో ఆర్థికంగా బలహీనులైన హిందువులను పెళ్లి  చేసుకుని  ఇలా బలవంతంగా మతమార్పిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. స్నేహితులు బంధువులు శక్తివంతమైన అటువంటి భూస్వాములు బాలికను అపహరించి ఏకంగా వివాహ వయసు రాకముందే పెళ్లి చేసుకుని ఇక ఆ తర్వాత హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి  బలవంతంగా మారుస్తున్నారు. అంతేకాదు కొంతమంది పేద కుటుంబాలకు రుణాలు ఇచ్చి రుణాల పేరుతో మతమార్పిడి చేయిస్తున్నారట. పాకిస్తాన్లో మతస్వేచ్ఛ కు హక్కు బంధం కలుగుతుందని మానవ హక్కుల కమిషన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: