కరోనా వైరస్: వారిపైనే అధిక ప్రభావం ...?

VAMSI
ప్రపంచ దేశాలను గడగడ వణికించిన కరోనా వైరస్.... ఇండియా ని కూడా వదలకుండా ముప్పుతిప్పలు పెట్టింది. అయితే కొద్ది రోజులుగా భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే ఇండియా లో కరోనా వ్యాప్తి శాతం ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నెమ్మది నెమ్మదిగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటూ... ఇంతకు ముందులా రోడ్ల పై కనిపిస్తున్నారు. ఓవైపు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తున్నప్పటికీ.... కరోనా పై ఉన్న భయంకరమైన భయం కొద్దిగా తగ్గి, సమాజంలో ఇప్పుడు కాస్త ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది.

ఓ వైపు వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న భరోసా, మరోవైపు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే ఆనందం..... ప్రజలకు కాస్త ధైర్యాన్ని పెంచాయి. అయితే ఊహించని రీతిలో మార్పులు చెందిన కొత్త కరోనా వైరస్ ప్రజలను ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. యూకే నుంచి భారత్ కు వచ్చిన న్యూ స్ట్రెయిన్  ప్రజల్ని మరలా కలవరపెడుతోంది. ఇప్పుడు ఈ వైరస్ ఇంకెంత బీభత్సం సృష్టించనుందో అంటూ అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వము కూడా న్యూ స్ట్రెయిన్ తో జాగ్రత్తగా ఉండాలని  హెచ్చరించింది. కరోనా ఎంతో కొంత తగ్గినప్పటికీ.... ఈ కొత్త స్ట్రెయిన్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇక కరోనా బారిన పడిన వ్యక్తులలో 63శాతం వరకు పురుషులు ఉన్నారని ఇప్పటివరకు చేసిన సర్వేలు చెబుతున్నాయి. 37శాతం మంది మహిళలు ఉన్నారు.  ఇక కరోనా మరణాల శాతం చూస్తే ఇక్కడ కూడా మహిళల కంటే పురుషులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు  గణాంకాలు చెప్తున్నాయి. ఇక కరోనా సోకిన వారిలో 52 శాతం మంది 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు ఉండగా, 60 ఏళ్ల పైబడిన వారు కేవలం 14శాతం మాత్రమే ఉన్నారు. ఈ నూతన అధ్యయనాల వలన తెలిసిందేమిటంటే.... పురుషులు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతుండగా... యువత ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: