జగన్ అన్న ఆశయం నెరవేరింది:ఎమ్మెల్యే

N.ANJI
కడపజిల్లా మైలవరం మండలంలో  మంగళవారం పేదలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి పట్టాలనుపంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం మైలవరం మండల పరిధిలోని వేపరాల గ్రామము పొలిమేరలో మైలవరం, వేపరాల,  దొమ్మర్నంద్యాల గ్రామములో ఉండే 245 మంది  ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటిస్థలం పట్టాలను  శాసన సభ్యులు డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి  అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గన్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన న‌వ‌ర‌త్నాలు  కార్య‌క్ర‌మం వారి సొంతింటి క‌ల‌ల్ని సాకారం చేయ‌నున్నది. న‌వ‌రత్నాల్లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు పేరుతో రాష్ట్రంలోని ప్ర‌తి అర్హులైన నిరుపేద‌కు ఇంటి స్థ‌లంతోపాటు ఇళ్లు నిర్మించుకొనేందుకు అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయం అందించేందుకు రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం తోడ్పాటు చేపడుతోందని తెలిపారు.  గ్రామ పరిధిలో ఉండే  గ్రామ‌ సచివలయాల   ద్వారా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చేప‌ట్టిన ల‌బ్దిదారుల గుర్తింపు ప్ర‌క్రియ చేపట్టి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ ఏర్పాట్లు చేయడం జరిగింది.
వీరంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు మంజూరు చేసేందుకు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో  ల‌బ్దిదారులుగా గుర్తించిన వారంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు అంద‌జేసేందుకు అధికార యంత్రాంగం గ‌త ఏడాది కాలంగా అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ లే ఔట్ లలో రోడ్లు, క‌మ్యూనిటీ స్థ‌లాలు త‌దిత‌ర‌ అన్ని సౌక‌ర్యాల‌తో అభివృద్ధి చేశారు. ఈ లేవుట్లలో మంజూరు చేసే ఇళ్ల ప‌ట్టాల‌న్నీ కుటుంబంలోని మ‌హిళ‌ల పేరుతోనే అందించ‌నున్నామని తెలిపారు.జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం 4953 మంది లబ్ధిదారులను గుర్తించి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.జగనన్న నవరత్నాలు పేర్కొన్నట్లు పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడం తో జగన్ అన్న ఆశయం నెరవేరింది ఎమ్మెల్యే అన్నారు.
అక్క చెల్లెలు బాగుండాలి ఉద్దేశంతో మహిళల పేట ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది.మధ్యాహ్నం 12 నుంచి లబ్ధిదారులు ప్రజలు ఉన్నప్పటికీ వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు . దాంతో లబ్ధిదారులు నీరసం గా  సమావేశంలో కూర్చున్నారు. జగనన్న పథకాల గురించి చెబుతుంటే చప్పట్లు కొట్ట మంటే శరీరంలో శక్తి లేక పోవడంతో అక్కడ వచ్చిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అవాక్కయ్యారు. లబ్దిదారులకు ప్రజలకు తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు.ఎమ్మెల్యే వచ్చే సమయంలో ని ళ్ళ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: