అర్థరాత్రి విందు.. మహిళలతో చిందు.. షాక్ ఇచ్చిన పోలీసులు.. చివరికి

Satvika
ప్రముఖ నగరాల్లో రాత్రిపూట పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయి..ముఖ్యంగా హైదరాబాద్, బెంగుళూరు, చైనా వంటి జంట నగరాల్లో పార్టీల పేరుతో మద్యాన్ని స్వీకరించడం, అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం వంటివి కామన్ అయిపోయాయి..ఎక్కువగా యువత ఇలాంటి ఘటనలు ఆకర్షితులు అవుతున్నారు. డబ్బున్న వారి పిల్లలు ఇలాంటి పార్టీలను చాటు మాటు వ్యవహారాలను నడిపిస్తున్నారు.. డబ్బులతో పోలీసుల కళ్లు కప్పి అసాంఘిక కార్యకలాపాలకు పల్పాడుతున్నారు. ఇటీవల కాలంలో లాక్ డౌన్ ఉన్నా కూడా ఇలాంటి పార్టీలు యదేచ్ఛగా సాగాయి. 



ఇప్పుడు మాత్రం పోలీసులు ఇలాంటి పార్టీలపై నిఘా పెడుతున్నారు. హైదరాబాద్ లాంటి పార్టీలు, రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. పార్టీల పేరుతో మద్యాన్ని ఎరులుగా పాటిస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ పార్టీల పై ఆసక్తి చూపిస్తున్నారు.. పార్టీలకు అమ్మాయిలను తెచ్చుకొని ఇష్టమొచ్చినట్లు డ్యాన్సులు వగైరా వగైరాలు చేస్తున్నారు. అలాంటి పార్టీలపై పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా నగరంలో ఎక్కడో చోట వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ పార్టీని పోలీసులు పట్టుకున్నారు.. 


అసలు విషయానికొస్తే.. కీసరలో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రీడ్జ్ రిసార్టులోని ఓ విల్లాలో బెస్ట్ క్రాప్ విత్తన సంస్థ మేనేజర్‌ ఆదివారం రాత్రి సన్నిహితుల కోసం రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించి ఆరుగురు యువతులను, 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లు రేపు పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారాన్ని పెంచుకునేందుకు సంస్థ మేనేజర్‌ ఇలా అమ్మాయిలను తీసుకొచ్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. సీడ్స్ కంపెనీ మేనేజర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.వారి దగ్గర నుంచి ఫోన్లు, వాహనాన్ని, భారీ సంఖ్యలో డబ్బులను పోలీసులు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలను తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: