పేలిపోయిన పాక్ హెలికాప్టర్.. ఊహించని దాడితో వణుకు..?
ఇక అదే సమయంలో ప్రస్తుతం పాకిస్తాన్తో ఇతర దేశాలకు ఉన్న అన్ని రకాల సంబంధాలు కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉండడం పాకిస్తాన్ను మరింత ప్రమాదం లో పెడుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ సైనికులు చైనా సైనికులకు కొమ్ము కాస్తూ వారికి రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా పాకిస్తాన్ లో బెలూచ్ ఆర్మీ పాకిస్థాన్ సైన్యం పై దాడికి పాల్పడుతూ ఉండడం ప్రస్తుతం మరింత సంచలనంగా మారిపోయింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని చెప్పాలి.
పాకిస్తాన్ పై దాడి విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బెలూన్ ఆర్మీ ఇప్పటికే పలుమార్లు పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది అనే విషయం తెలిసిందే. ఇటీవల మరోసారి బెలూచ్ ఆర్మీ ఏకంగా 25 మంది పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న హెలికాప్టర్ పై దాడి చేసి ధ్వంసం చేస్తుంది. ఈ ఘటన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసింది. మొదట ఎలాంటి దాడి జరగ లేదు అని కవర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పలేదు.