రంగం సిద్ధం అయింది.. యుద్ధ ట్యాంక్ లకి డబ్బులు..?

praveen
భారతదేశం లో పరిణా మాలు రోజు రోజుకూ శరవేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం దీంతో వ్యూహాత్మకం గా అడుగులు వేస్తున్న భారత ప్రభుత్వం ఇతర దేశాల పై ఎక్కువగా ఆధార పడకుండా ఉండేందుకు స్వయంసమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది అనే విషయం తెలిసిందే. ముఖ్యం గా ఆయుధాల  విషయం లో స్వయం సమృద్ధి సాధించడమే  కాకుండా ఇతర దేశాలు సైతం భారత్పై ఆయుధాల కోసం ఆధారపడే విధంగా ప్రస్తుతం కీలక అడుగు ముందుకు వేసింది. ఈ క్రమం లోనే మునుపెన్నడూ లేని  విధంగా ఆయుధ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.

 అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ అభివృద్ధి చేయదలచిన అన్ని రకాల ఆయుధాలను నిధులు కేటాయిస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ తమ శాయశక్తులా కష్టపడుతూ ఎన్నో వినూత్న ఆయుధాలను తెరమీదికి తెచ్చింది. ఇప్పటికే తుపాకుల తయారీపై  దృష్టి పెట్టిన భారత్.. ఇక లైట్ వెయిట్ విమానాలను తయారు చేసేందుకు కూడా సిద్ధం అయ్యింది అనే విషయం తెలిసిందే.

 అదే సమయంలో వరుసగా ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపణులను తయారుచేసి వరుసగా ప్రయోగాలు నిర్వహించి విజయవంతం అవుతుంది డిఆర్డిఓ అదే సమయంలో సబ్మెరైన్ లకు అమర్చే టువంటి టార్పేడో లను  కూడా తయారు చేస్తుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే మేకిన్ ఇండియా ప్రోగ్రాం లో భాగంగా అర్జున్ ఎం కె 1ఏ  యుద్ధ ట్యాంకులను భారతదేశంలోనే తయారుచేయడానికి రంగం సిద్ధమైంది. ఇక దీని కోసం ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 118 అర్జున్ ఎం కె 1ఏ  ట్యాంకులను తయారీకి రంగం సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: