ట్రంప్ కి రివర్స్ గా జో బిడెన్.. లెక్క తప్పుద్దా..?

praveen
సాధారణం గా రాజకీయాల లో అప్పుడు వరకు అధికారంలో ఉన్న పార్టీ కి  బదులు వేరే పార్టీ అధికారం లోకి వస్తే వారికి రివర్స్ గా పాలన సాగించడం లాంటివి జరగడం సర్వ సాధారణం అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతకు ముందు పాలకుల కంటే తాము ఎంతో భిన్నంగా పాలన చేశాము అని చెప్పుకుంటూ ఉంటారు. సాధారణంగా ప్రతీ రాష్ట్రం లో కూడా ఇలాంటి తరహా ఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఇలాంటి తరహా పరిస్థితులు నెలకొన్నాయి అన్నది అర్ధమవుతుంది.

 దీనికి సజీవ మైనటువంటి సాక్ష్యం అమెరికా అనే చెప్పాలి. అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో  అంతకు ముందు ఉన్న అధ్యక్షుడుపై బిడెన్  విజయం సాధించారు.  జో బిడెన్ వచ్చిన తర్వాత పాలనలో పూర్తిగా మార్పులు తీసుకుస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్ మాఫియాకు  కేరాఫ్ అడ్రస్ అయిన మెక్సికో సిటీలో ఎంతో మంది పై నిబంధనలు  పెట్టడం లాంటివి చేసారు డోనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు బిడెన్  అధికారంలోకి వచ్చిన తర్వాత రూటు మార్చేశారు.

 ఇటీవలే మెక్సికో ప్రెసిడెంట్ తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు బిడెన్.. కీలక చర్చలు జరిపారు. ఇక మెక్సికోలో అందరూ ఇష్టమైన కార్యకలాపాలు చేసుకోవచ్చని అందరికీ మానవతా దృక్పథంతో అవకాశం కల్పిస్తాము  అంటూ జో్  బిడెన్ తెలిపారు. అయితే ఇటీవలే బిడెన్  తీసుకున్న నిర్ణయం అమెరికా యొక్క ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఈగో ని సంతృప్తి పరుచుకోవడం కోసమే అన్నట్లుగా ఉంది అని విశ్లేషకులు అంటున్నారు ఇక నిర్ణయంతో  అరాచక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉందని అంటున్నారు. జో బిడెన్  నిర్ణయంతో మరోసారి డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయే అవకాశం ఉందని ఈ క్రమంలోనే  మెక్సికోలో దారుణ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.  ఏం జరుగుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: